Advertisementt

రెడీ టు రిలీజ్ అంటున్న నారప్ప

Wed 16th Jun 2021 12:12 PM
venkatesh narappa,naarappa movie,venkatesh,srikanth addala,tamil asuran,dhanush asuran movie  రెడీ టు రిలీజ్ అంటున్న నారప్ప
Ready release for Narappa రెడీ టు రిలీజ్ అంటున్న నారప్ప
Advertisement
Ads by CJ

వెంకటేష్ -శ్రీకాంత్ అడ్డాల కాంబో లో తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ మూవీని తెలుగులో నారప్ప గా రీమేక్ చేసారు. మే 14 న సినిమా రిలీజ్ కి డేట్ ఇచ్చినా.. అది సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ మూత బడడంతో.. సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. వెంకటేష్ మరో సినిమా దృశ్యం 2 కూడా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే ఇప్పుడు థియేటర్స్ జులై నుండి ఓపెన్ అవుతాయనే న్యూస్ నడుస్తుంది. దానిలో భాగంగా నారప్ప దర్శకనిర్మాతలు ప్రస్తుతం నారప్ప పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్నట్లుగా ప్రకటించారు.

అసురన్ రీమేక్ నారప్ప లో వెంకటేష్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇదివరికెన్నడు చూడని విధంగా వెంకటేష్ కొత్తగా కనిపిస్తారని, ఆయన భార్య గా ప్రియమణి సుందరమ్మ పాత్రని పోషించింది అని, పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ అయ్యింది.. మరో వారంలో ఫస్ట్ కాపీ రెడీ అంటున్నారు నారప్ప చిత్ర బృందం. త్వరలోనే నారప్ప రిలీజ్ డేట్ ఇస్తామని చెప్పి ఫాన్స్ ని కూల్ చేసారు. కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో థియేటర్స్ క్లోజ్, సినిమా రిలీజ్ ల పోస్ట్ పోన్ తో ప్రేక్షకులు చాలా బోర్ ఫీలవుతున్నారు. ఈ టైం లో కొత్త సినిమా రిలీజ్ లు ఉంటే ఆ సినిమాలకుండే క్రేజు వేరే లెవల్లో ఉండడం ఖాయం.

Ready release for Narappa:

Ready release for Venkatesh Narappa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ