Advertisementt

పుష్ప లో హైలెట్ ఫారెస్ట్ ఫైట్ కాదు..

Mon 21st Jun 2021 08:43 AM
allu arjun pushpa movie,pushpa boat fight‌ scene,highlights  పుష్ప లో హైలెట్ ఫారెస్ట్ ఫైట్ కాదు..
The highlight in Pushpa is not the Forest Fight పుష్ప లో హైలెట్ ఫారెస్ట్ ఫైట్ కాదు..
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా ఫిలిం పుష్ప షూటింగ్ కోసం సుకుమార్ అండ్ టీం రెడీ అవుతుంది. కరోనా సెకండ్ వేవ్ తో అందరికన్నా లాస్ట్ లో షూటింగ్ కి ప్యాకప్ చెప్పారు. అల్లు అర్జున్ - మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ కాంబో సీన్స్ తెరకెక్కేటప్పుడు అల్లు అర్జున్ కరోనా బారిన పడడంతో, సెకండ్ వేవ్ ఉధృతి కూడా ఎక్కువవడంతో పుష్ప షూటింగ్ ని ఆపేసింది టీం. ఇక ఈ సినిమాలో మొదటి నుండి ఫారెస్ట్ ఫైట్ పై భారీ అంచనాలున్నాయి. ఆ సీన్స్ కోసం 6 కోట్ల ఖర్చు పెట్టినట్లుగా చెప్పారు. ఆ యాక్షన్ సీన్ సినిమా కి హైలెట్ అంటూ చెబుతున్నారు.

కానీ ఇప్పుడు పుష్ప సినిమాలో మరో ఫైట్ సీన్ ఇండియన్ సినిమా చరిత్రలో ఎవరూ చూపించని విధంగా డిజైన్ చేసారని.. అది బోట్ ఫైట్ అని అంటున్నారు. భారీ బడ్జెట్ తో ఈ బోట్‌ ఫైట్‌ థియేటర్లో ప్రేక్షకులు థ్రిల్‌కు గురయ్యేలా చిత్రీకరించాలని సుకుమార్‌ భావిస్తున్నారట. పుష్పరాజ్ కి విలన్ ఫహద్ ఫాజిల్ కి మధ్యన ఈ యాక్షన్ సీన్స్ రాగానే ప్రేక్షకులకి గూస్ బంబ్స్ రావడం ఖాయమట. ఇక ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న పుష్ప సినిమాకి సంబందించిన మిగతా బ్యాలెన్స్ షూట్ కూడా తొందరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లాలని చూస్తున్నారట. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని హీరోయిన్ రష్మిక కూడా వెయిట్ చేస్తుంది. త్వరలోనే పుష్ప కొత్త షెడ్యూల్ ని ప్రకటించనుంది టీం.

The highlight in Pushpa is not the Forest Fight:

Allu Arjun Pushpa Movie Boat Fight‌ Scene highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ