Advertisementt

బాలీవుడ్ మొదలెట్టింది.. మరి టాలీవుడ్

Tue 15th Jun 2021 05:52 PM
akshay kumar,confirms,bell bottom movie,bell bottom release date  బాలీవుడ్ మొదలెట్టింది.. మరి టాలీవుడ్
Akshay Kumar confirms Bell Bottom release date బాలీవుడ్ మొదలెట్టింది.. మరి టాలీవుడ్
Advertisement
Ads by CJ

సెకండ్ వేవ్ మొదలు కాగానే బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు సినిమా షూటింగ్స్ మొత్తం ఆగిపోయాయి. అలాగే థియేటర్స్ కూడా బంద్ అయ్యాయి. అందులో సల్మాన్ ఖాన్ సెకండ్ ఉధృతిలో సాహసం చేసి థియేటర్స్ లోను, ఓటిటిలోను రాధే మూవీని రిలీజ్ చేస్తామని చెప్పినా. మహారాష్ట్రలో సెకండ్ వేవ్ ఉధృతితో థియేటర్స్ తెరిచే సాహసం చెయ్యలేదు. దానితో ఆ మూవీ జస్ట్ ఓటిటిలోనే రిలీజ్ అయ్యింది. ఇక గత రెండు నెలలుగా థియేటర్స్ క్లోజ్ అవడం, ఈ నెల కూడా థియేటర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో.. జులై నుండి 50 పర్సెంట్ అక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ కాబోతున్నాయనే న్యూస్ బయలు దేరింది.

ఆ తర్వాత మెల్లగా 100  పర్సెంట్ ఆక్యుపెన్సీ పెరుగుతుంది. అందుకే బాలీవుడ్ ముందుగా సినిమాల రిలీజ్ డేట్ ని లాక్ చేస్తుంది. అందులో ముందుగా అక్షయ్ కుమార్ బెల్ బాట‌మ్ ని థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు డేట్ ఇచ్చారు. ఈ సినిమా జులై 27న ప్రేక్ష‌కుల రానుంది. ఎప్పుడో రిలీజ్ కావల్సిన సినిమా ఇప్పుడు జులై కి డేట్ మార్చుకుంది. మరి బాలీవుడ్ కదిలింది. ఇక టాలీవుడ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో.. ఇప్పుడిప్పుడే హీరోలు షూటింగ్స్ కోసం బయలు దేరుతున్నారు.. థియేటర్స్ కూడా ఓపెన్ అయితే సినిమా రిలీజ్ డేట్స్ కూడా వచ్చేస్తాయి.

Akshay Kumar confirms Bell Bottom release date:

Bell Bottom release in theaters

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ