నిన్న సాయంత్రం జబర్దస్త్ హైపర్ ఆది పై ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఈ టివిలో హైపర్ ఆది పెర్ఫర్మ్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో లో తెలంగాణ భాషను, బతుకమ్మ ని కించపరిచే విధంగా మాట్లాడంటూ తెలంగాణ జాగృతి సభ్యులు ఆదిపై ఫిర్యాదు చేసారు. అంతేకాకుండాహైపర్ ఆదిని హైదరాబాద్ లోను, తెలంగాణలోనూ తిరగనివ్వమని, ఆది గనక క్షమాపణ చెప్పకపోతే ఊరుకోమని హెచ్చరించారు. తాజాగా ఈ కేసుపై హైపర్ ఆది స్పందించాడు. తాను తప్పు చేస్తే క్షమాపణలు చెప్పడానికి నాకెలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు.
ఆ షో లో స్కిట్ ప్రకారం బతుకమ్మ సాంగ్ ని స్టార్ట్ చేసారు.. దానిని తాను కేవలం అనుసరించాను అని చెబుతున్నాడు. అంతేకాదు.. బతుకమ్మ పాటని తాను కించపరిచినట్లుగా వస్తున్న మాటలు కేవలం ఎడిటింగ్ లో లోపమే అని చెబుతున్నాడు. తాను అన్న పదాన్ని ఎడిటింగ్ లో కట్ చేశారని ఆది చెబుతున్నాడు. ఇక ఈ ఇష్యు లో ఓ న్యూస్ ఛానల్ చేసిన అతి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ఛానల్ వారు తెలంగాణ జాగృతి వారిని లైవ్ లో కూర్చోబెట్టి ఆది ని ఫోన్ లో కాంటాక్ట్ చెయ్యగా.. ఆది నాకు తెలంగాణ సంసృతి సంప్రదాయాలు తెలుసు అని, వాటిపై ఎక్కడా నోరు జారలేదని, ఎడిటింగ్ లోపం వలనే ఇది జరిగింది అంటూ.. తప్పు చేస్తే క్షమాపణ చెబుతాను అని చెప్పాడు.