Advertisementt

కోలీవుడ్ సింగం తో టాలీవుడ్ మాస్ డైరెక్టర్

Sun 20th Jun 2021 09:53 PM
kollywood hero suriya,tollywood mass director boyapati srinu,suriya - boyapati srinu combo  కోలీవుడ్ సింగం తో టాలీవుడ్ మాస్ డైరెక్టర్
Boyapati Srinu to direct Suriya? కోలీవుడ్ సింగం తో టాలీవుడ్ మాస్ డైరెక్టర్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరోలు ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్స్ తో జత కడుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరో విజయ్ తో వంశి పైడిపల్లి పాన్ ఇండియా సినిమా ఓకె అయ్యింది. ఇప్పుడు మరో కోలీవుడ్ హీరో - టాలీవుడ్ డైరెక్టర్ మూవీ సెట్ కాబోతుంది అనే న్యూస్ మొదలైంది. అది కూడా మాస్ డైరెక్టర్ బోయపాటి.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎప్పటినుండో సూర్య కి తెలుగు దర్శకులతో పని చెయ్యాలని ఉన్నా.. కథలు సెట్ కాకపోవడంతో సూర్య కి తెలుగు సినిమా చేసే అవకాశం రాలేదు.

అయితే అఖండ సినిమాని ఫినిష్ చేసాక బోయపాటి మరోసారి అల్లు అర్జున్ తో సినిమా చెయ్యడానికి ట్రై చేస్తున్నాడని అన్నా అల్లు అర్జున్ వేరే దర్శకులతో ఉన్న కమిట్మెంట్స్ వలన బోయపాటికి డేట్స్ ఇవ్వలేకపోయాడట. దానితో బోయపాటి కోలీవుడ్ సూర్య కోసం కథ రాసుకున్నాడని.. ఈ కథని దిల్ రాజు తో చర్చించి సూర్య కి వినిపించారనే టాక్ మొదలైంది. ఇప్పటికే దిల్ రాజు రామ్ చరణ్ - శంకర్ పాన్ ఇండియా మూవీ, వంశీ పైడిపల్లి - విజయ్ పాన్ ఇండియా మూవీస్ ని నిర్మిస్తున్నాడు. మరి ఇప్పుడు సూర్య - బోయపాటి కాంబో కి కూడా దిల్ రాజే నిర్మాత అంటున్నారు. మరి కోలీవుడ్ సింగం తో టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కలిస్తే స్క్రీన్ దద్దరిల్లిపోవాల్సిందే. 

Boyapati Srinu to direct Suriya?:

Suriya To Team Up With Boyapati Srinu?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ