నేడు కొరటాల శివ పుట్టిన రోజు సందర్భంగా సినీప్రముఖులు కొరటాల శివకి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తోటి దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్స్ అందరూ కొరటాలకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అందులో ప్రముఖంగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న రామ్ చరణ్, ఆయనతో రెండోసారి జోడి కట్టబోతున్న ఎన్టీఆర్ చెప్పిన విషెస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. కొరటాల శివ చిరు తో తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీలో రామ్ చరణ్ కూడా సిద్ద పాత్రలో నటిస్తున్నాడు. కొరటాల శివ కి బర్త్ డే విషెస్ చెప్పడానికి ఆయన ఆచార్య సెట్ లోని సిద్ద లుక్ లో.. కొరటాల శివ తో కలిసి ఉన్న పిక్ ని షేర్ చేస్తూ కొరటాలకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.
ఇక కొమరం భీం అదే ఎన్టీఆర్ కూడా కొరటాలని స్పెషల్ గా విష్ చేసాడు. స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Wishing my dear friend and well wisher, @sivakoratala garu a very Happy Birthday అంటూ ట్వీట్ చేసాడు. ఎన్టీఆర్ - కొరటాల జనతా గ్యారేజ్ టైం లోనే మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ సినిమాతో ఎన్టీఆర్ కి మంచి హిట్ దక్కింది. ఇప్పుడు అదే కాంబోలో NTR30 తెరకెక్కబోతుంది. ఈసారి అది పాన్ ఇండియా లెవల్లో ఉండబోతుంది. NTR30 లుక్ లో ఎన్టీఆర్ చాలా సాఫ్ట్ గా బుద్ధిమంతుడిగా టక్ చేసుకుని కనిపిస్తున్నాడు. మరి వీళ్ళ స్టోరీ బ్యాక్ డ్రాప్ పై రకరకాల న్యూస్ లు ప్రచారంలో ఉన్నాయి.