చాలా రాష్ట్రాలు కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా. లాక్ డౌన్ పొడిగిస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాలు అన్ లాక్ ప్రక్రియను మొదలు పెట్టేశాయి. తమిళనాడు, కేరళ లాంటి కొన్ని రాష్ట్రాలు ఈనెల 21 వరకు లాక్ డౌన్ పొడిగించాయి. అయితే రేపు 20 తో తెలంగాణలోనూ లాక్ డౌన్ ముగియబోతుంది. ప్రస్తుతం ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు లాక్ డౌన్ సడలింపులు ఉండగా.. జూన్ 20 నుండి లాక్ డౌన్ ఎత్తివేసి కేవలం నైట్ కర్ఫ్యూ అమలు చెయ్యాలనే యోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది.
రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది అని తర్వాత మొత్తం లాక్ డౌన్ ఎత్తేసి సడలింపులు ఇవ్వాలనే నిర్ణయంలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. సడలింపుల్లో భాగంగా మెట్రో, ఆర్టీసీ సేవల సమయం పెంచబోతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దుల వద్ద అమలవుతున్న ఈ-పాస్ నిబంధనలను కూడా ఎత్తివేయనున్నారు. ఆ తర్వాత పది రోజుల తర్వాత అంటే జులై 1 నుంచి పబ్‌లు, జిమ్‌లతోపాటు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా హాళ్లకు కూడా అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది.