Advertisementt

యాక్షన్ షురూ అంటున్న హీరో-హీరోయిన్స్

Mon 14th Jun 2021 10:18 PM
samantha shakunthalam,naga chaitanya thank you movie,ravi teja khiladi movie,rajamouli rrr pan india movie,nithin,nani wall poster movie  యాక్షన్ షురూ అంటున్న హీరో-హీరోయిన్స్
Movie Shootings started in Tollywood యాక్షన్ షురూ అంటున్న హీరో-హీరోయిన్స్
Advertisement
Ads by CJ

కరోనా సెకండ్ వేవ్ తో సినిమా షూటింగ్స్ అన్ని బంద్ అవడము.. సెకండ్ వేవ్ కంట్రోల్ అయ్యి.. లాక్ డౌన్ కూడా అన్ లాక్ అవడంతో ఇప్పుడు చాలా సినిమాలు షూటింగ్ కి రెడీ అవుతుంటే అందులో అందరికన్నా ముందు నితిన్ మేస్ట్రో సినిమాని హైదరాబాద్ లో నేడు లాస్ట్ షెడ్యూల్ మొదలు పెట్టేసాడు. మూవీ యూనిట్స్ మొత్తం కరోనా వ్యాక్సిన్ వేయించుకుని మరీ రంగంలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం నితిన్ షురూ చెయ్యగా, నాని వాల్ పోస్టర్ బ్యానర్ మీద సినిమా నిర్మిస్తూ క్లాప్ కొట్టిన అప్ డేట్ ఇచ్చాడు. మరోపక్క సమంత శాకుంతలం పాన్ ఇండియా షూటింగ్ కి రెడీ అయ్యింది. మరో రెండు మూడు రోజులో సమంత హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లోకి అడుగుపెట్టబోతుంది.

నాగ చైతన్య థాంక్యూ మూవీ షూటింగ్ ఈనెల 21 నుండి రెడీ అవుతున్నాడు. అలాగే రవితేజ ఖిలాడీ కూడా ఈనెల 24 న మొదలు పెట్టేసి కంప్లీట్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. ఇక భారీ బడ్జెట్ మూవీస్ అయిన ఆచార్య, పుష్ప లు ఇంకా షెడ్యూల్ ఖరారు చెయ్యకపోయినా.. ఆర్.ఆర్.ఆర్ లాస్ట్ షెడ్యూల్ కి రాజమౌళి ముహూర్తం పెట్టినట్లుగా తెలుస్తుంది. జులై 1 నుండి ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కోసం సమాయత్తమవుతోంది టీం. ఇక అఖండ, ఆచార్య, ఇలా మిగతా సినిమాల బ్యాలెన్స్ షూటింగ్స్ కూడా ఫినిష్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్ళిపోతే.. థియేటర్స్ ఓపెన్ అవ్వగానే రిలీజ్ డేట్స్ ప్రకటించెయ్యాలనే కసితో ముందుకు వెళుతున్నారు.

Movie Shootings started in Tollywood:

Shoots to resume in Tollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ