Advertisementt

మిష‌న్ ఇంపాజిబుల్ తాప్సి

Mon 14th Jun 2021 08:14 PM
taapsee pannu,south movies,tapsee key role,mission impossible  మిష‌న్ ఇంపాజిబుల్ తాప్సి
Taapsee Mission Impossible మిష‌న్ ఇంపాజిబుల్ తాప్సి
Advertisement
Ads by CJ

ఒక్కప్పుడు తెలుగు సినిమాల్లో నటించింది.. కానీ సౌత్ ప్రేక్షకులు ఆమెని పట్టించుకోలేదు.. తర్వాత మెల్లగా బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ టాప్ హీరోయిన్ ప్లేస్ లో కూర్చుకుని.. తర్వాత సౌత్ దర్శకుల మీద విరుచుకుపడింది. ఆమె వేరెవరో కాదు.. తాప్సి పన్ను. ఝుమ్మంది నాదం, రవితేజ వీర, వెంకటేష్ లతో కలిసి నటించినా తాప్సికి క్రేజ్ రాకపోయేసరికి బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ జెండా పాతేసింది. తెలుగు సినిమాలని చాలా అరకొరగా ఒప్పుకుంటున్న తాప్సి.. ఇక్కడ అందాల ఆరబోతకన్నా నటనకు ప్రాధాన్యమున్న సినిమాలనే ఓకె చేస్తుంది. బాలీవుడ్ లో బికినీ వేసినా చెల్లుతుంది.. సౌత్ లో చూస్తారు తప్ప ఆఫర్స్ ఇవ్వరనుకునే తాప్సి ని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ సౌత్ సినిమా చెయ్యడానికి ఒప్పించాడనే టాక్ నడుస్తుంది.

తీసిన ఒకే ఒక్క మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సక్సెస్ అవడంతో దర్శకుడు స్వరూప్ మళ్ళీ అలాంటి కాన్సెప్ట్ తోనే మిష‌న్ ఇంపాజిబుల్ మొదలు పెట్టాడు.  ఈ సినిమా కూడా ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. ఏజెంట్‌ సాయి శ్రీనివాసలాగే ట్విస్టుల‌తో నిండిపోతుంద‌ట‌. తిరుప‌తి నేప‌థ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ తో వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా కోసం తాప్సిని ఒప్పించారని, ఈ సినిమాలో తాప్సి కీలకం కాదు.. హీరో లాంటి కేరెక్టర్ చేస్తుంది అని, తాప్సి అయితే ఇటు తెలుగు, అటు హిందీ లో మంచి మార్కెట్ ఉంది కాబట్టి.. సినిమా వర్కౌట్ అవుతుంది అని ఆమెకి కాస్త భారీగా ముట్టజెప్పి మరీ ఈ సినిమాలోకి తీసుకున్నారని అంటున్నారు. మిష‌న్ ఇంపాజిబుల్‌ కొత్త షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్ లో మొదలు కాబోతుందట.

Taapsee Mission Impossible:

Taapsee key role in Mission Impossible

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ