ముంబై లో సెకండ్ వెవ్ ఉధృతి వలన లైగర్ సినిమా షూటింగ్ వాయిదా వేసేసి టీం మొత్తం హైదరాబాద్ కి వచ్చేసింది. ఛార్మి - పూరి - హీరో విజయ్ దేవరకొండ ఇలా మొత్తం హైదరాబాద్ కి వచ్చేసారు. గత నెలన్నరగా హైదరాబాద్ లోనే ఉన్న లైగర్ టీం.. ఇక్కడే హైదరాబాద్ లో సారధి స్టూడియోస్ లో లైగర్ సెట్ వేసుకుని కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తారని అన్నారు. అయితే తాజాగా మహారాష్ట్రలో లాక్ డౌన్ సడలింపులతో లైగర్ ప్రొడ్యూసర్ ఛార్మి, దర్శకుడు పూరి ముంబై వెళ్లిపోయారు. అక్కడ లైగర్ షూటింగ్ కి సంబందించిన విషయాలను చక్కబెట్టుకుంటున్నారు. ఇక తాజాగా తన సినిమా షూటింగ్స్ కోసం హీరోయిన్ రశ్మిక్ ముంబై ఫ్లైట్ ఎక్కిన విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ తో డీప్ ఫ్రెండ్ షిప్ చేసే రష్మిక.. లైగర్ టీం తో మంచి తత్సంబందాలను మెయింటింగ్ చేస్తుంది. దానిలో భాగంగానే ఛార్మి ముంబై కి వచ్చింది ని తెలిసి రష్మిక కూడా వాళ్లతో జాయిన్ అయ్యింది. ఛార్మి పెంపుడు కుక్కలతోను, రశ్మిక్ ఎడాబ్ చేసుకున్న పెట్ తో ఛార్మి - రష్మికాలు చేసిన రచ్చ ఇప్పుడు ఫోటో రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఛార్మి స్వయంగా రష్మిక తో ఉన్న ఫొటోస్ ని షేర్ చెయ్యడంతో ముంబైలో రష్మిక - ఛార్మీల రచ్చ అంటూ క్యాప్షన్ పెట్టి మరీ వాటిని వైరల్ చేస్తున్నారు అభిమానులు.