Advertisementt

పాన్ ఇండియా కోరిక తీరింది

Sun 13th Jun 2021 07:43 PM
pan india movies,rrr movie,radhe shyam movie,salaar movie,pushpa pan india movie,koratala - ntr combo movie,pooja hegde,rashmika,shruthi haasan,alia bhatt,ananya panday  పాన్ ఇండియా కోరిక తీరింది
Pan India has become a desire పాన్ ఇండియా కోరిక తీరింది
Advertisement
Ads by CJ

తెలుగు నుండి ఇతర భాషల దర్శకులు ఇప్పుడు చాలామంది పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ నుండి రాధాకృష్ణ రాధేశ్యామ్, పూరి జగన్నాధ్ లైగర్, సుకుమార్ పుష్ప అలాగే ప్రశాంత్ నీల్ సలార్ మూవీ, ఇంకా ఆదిపురుష్, నాగ్ అశ్విన్ పాన్ ఇండియా మూవీ, ఆ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల శివ మూవీస్ ఇలా చాలామంది హీరోలు పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలంతా ఒకేసారి అంటే అటు ఇటుగా పాన్ ఇండియా మర్కెట్ లోకి అడుగుపెడుతున్నారు. అయితే ఈ సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్స్ లో ఇప్పుడు చాలా ఉత్సుకత పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం హీరోల కన్నా హీరోయిన్స్ ఎక్కువగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గురించి ఎగ్జైట్ అవుతున్నారు. 

వారిలో సలార్ తో శృతి హాసన్, ఆదిపురుష్ తో కృతి సనన్, అలాగే నాగ్ అశ్విన్ మూవీ తో దీపికా పదుకొనే, రాధేశ్యామ్ తో పూజ హెగ్డే, లైగర్ మూవీ తో అనన్య పాండే, ఇంకా ఆర్. ఆర్.ఆర్ తో అలియా భట్, పుష్ప తో రష్మిక ఇలా పాన్ ఇండియా మర్కెట్ లోకి అడుగుపెడుతున్న హీరోయిన్స్. అందులో పూజ హెగ్డే, రశ్మికలు బాగా ఎగ్జైట్ అవుతున్నారు. పూజ హెగ్డే కి రాధేశ్యామ్ తో పాన్ ఇండియా కల తీరిపోయినట్టుగా చెబుతుంది. అసలు మోహింజదారో తోనే సక్సెస్ కొడదామనుకుంటే.. అది ప్లాప్ అవడంతో మళ్ళీ ఆ కల రాధేశ్యామ్ తో తీరిపోయింది అంటుంది. ఇక రష్మిక అయితే పుష్ప షూటింగ్ మొదలయ్యింది మొదలు తెగ ఎగ్జైట్ అవుతుంది. మరి ఈ హీరోయిన్స్ ఒక్క పాన్ ఇండియా మూవీతో మొత్తంగా అన్ని భాషలతో టాప్ లేపొచ్చు. 

Pan India has become a desire:

 Pan India movie heroines list

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ