Advertisementt

విజయ్ దేవరకొండ స్పెషల్ మెస్సేజ్

Fri 18th Jun 2021 06:41 PM
vijay devarakonda,special massage,corona kits,rowdy star,rowdy brands,rowdy hero vijay deverakonda  విజయ్ దేవరకొండ స్పెషల్ మెస్సేజ్
Vijay Devarakonda Special Massage on Covid Kits విజయ్ దేవరకొండ స్పెషల్ మెస్సేజ్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ స్టార్ హీరో రేంజ్ ని అతి తక్కువ కాలంలో అందుకుని వరసగా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా అదరగొడుతున్న విజయ్ దేవరకొండ క్రేజ్ పాన్ ఇండియా లెవల్లో ఉంది. స్టార్ హీరోల కన్నా కూసింత ఎక్కువే రౌడీ హీరో స్టార్ బ్రాండ్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం లైగర్ పాన్ ఇండియా ఫిలిం లో నటిస్తున్న విజయ్ దేవరకొండ గత ఏడాది కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో ఫండ్ రైసింగ్ తో చాలామందిని ఆదుకున్నాడు. ఇక ఈ ఏడాది కరోనా జాగ్రత్తల గురించి స్పెషల్ వీడియోస్ మెసేజెస్ ఇస్తున్నాడు.

ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కరోనా కిట్స్ విషయమై వీడియో ద్వారా చెప్పిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కరోనా కిట్ల పై అందరిలో ఆవాహన కల్పించడానికి ఓ వీడియో చేసాడు. ఓ స్వచ్చంద సంస్థ ఉచితంగా ఇస్తోన్న కరోనా కిట్ల విషయంలోనే విజయ్ దేవరకొండ ఈ వీడియో లో చెప్పుకొచ్చాడు. కరోనా పరిస్థితుల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరంపాటించడం ఎంత ముఖ్యమో.. శరీరానికి ఇమ్యూనిటీ పెంచుకోవడం అంతే ముఖ్యం. ఈ సమయంలోనే ధని యాప్ చేస్తోన్న కార్యక్రమం గురించి మీకు చెప్పాలి. 25 లక్షల కిట్లను ధని యాప్ అందరికి ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. అవసరమైన వారు ఆ కిట్ల ని తీసుకోండి అంటూ ఆ స్పెషల్ వీడియో లో విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

Vijay Devarakonda Special Massage on Covid Kits :

Vijay Devarakonda Massage on Corona Kits 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ