ఒకప్పుడు కామెడీ డైరెక్టర్ గా భారీ హిట్స్ కొట్టిన శ్రీను వైట్ల ని ఇప్పుడు స్టార్ హీరోలు పక్కనబెట్టేశారు. కారణం ఆయన ప్లాప్ ల్లో ఉండడమే. వరసగా సినిమాలు ప్లాప్ అవడంతో శ్రీను వైట్ల కథ వినడానికి కూడా హీరోలు సిద్ధపడడం లేదు. దానితో కెరీర్ స్టార్టింగ్ లో మంచు విష్ణు తో చేసిన ఢీ సినిమా కి కొనసాగింపుగా డి అండ్ డి సినిమాని మొదలు పెట్టాడు శ్రీను వైట్ల. ఆ సినిమా ఇదిగో అదిగో పట్టాలెక్కుతోంది అనడమే కానీ.. ఇంతవరకు సెట్స్ మీదకెళ్ళలేదు. తాజాగా ఆ సినిమా విషయాలను ఓ ఇంటర్వ్యూ లో పంచుకున్నారు శ్రీను వైట్ల. లాక్ డౌన్ టైం లో రైటర్స్ తో జూమ్ మీటింగ్ నిర్వహిస్తూ మూడు కథలను లాక్ చేసినట్లుగా చెప్పాడు శ్రీను వైట్ల. అంతేకాదు.. వెబ్ సీరీస్ లు చూస్తూ జిమ్ చేసేవాడిని అని చెప్పాడు.
అయితే డి అండ్ డి సినిమా ఢీ కి సీక్వెలా అని అడిగితే ఎంత మాత్రమూ కాదంటున్నాడు. ఢీ కామెడీ ఎంటర్టైనర్, డి అండ్ డి భిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నామని, కానీ ఢీ తో డి అండ్ డి కి ఎక్కడో చిన్న కనెక్షన్ ఉంటుంది అని, డి అండ్ డి చూస్తున్నంత సేపు ఢీ సినిమాలో పాత్రలు గుర్తుకు రావడం సహజమని చెబుతున్నాడు శ్రీను వైట్ల. ఢీ సినిమా ని గుర్తు చేసుకుంటూ.. నవ్వుకుంటూ డి అండ్ డి కథ రెడీ చేసాము. లాక్ డౌన్ వలన ఇంకా సినిమా పట్టాలెక్కలేదని. లాక్ డౌన్ ముగియగానే మంచు విష్ణు తో కలిసి సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తామని శ్రీను వైట్ల చెప్పారు. ఇక మంచు విష్ణు కి కూడా గత కొన్నాళ్లుగా హిట్స్ లేవు. సో ఈ సినిమా మీదే మంచు విష్ణు ఆశలు అన్ని.