ప్రస్తుతం టాలీవుడ్ లో దుమ్మురేపుతున్న పూజ హెగ్డే.. ప్రభాస్ తో రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీలో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. స్టార్ హీరోల చూపు పూజ హెగ్డే మీదే. అంతలా పూజ క్రేజ్ పెరిగిపోయింది. గ్లామర్ డాల్ గా అందాల ఆరబోతతో ఆఫర్స్ పట్టేస్తున్న పూజ హెగ్డే టాలీవుడ్ లో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో స్టాండప్ కామెడీ చేస్తూ గ్లామర్ గా కనిపించనుంది. అలాగే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నీలాంబరిగా కొత్త లుక్ లో పూజ హెగ్డే అదరగొట్టేస్తుంది. ఇక తమిళ్ లో స్టార్ హీరో విజయ్ సరసన Vijay65 లో నటిస్తుంది.
మరోపక్క బాలీవుడ్ లో రన్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోల తో సినిమాలు చేస్తున్న పూజ హెగ్డే సోషల్ మీడియా అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. లాక్ డౌన్ లో గ్లామర్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూత్ కి నిద్ర లేకుండా చేస్తున్న పూజ హెగ్డే తాజాగా షేర్ చేసిన ఫొటోస్ బ్లాక్ అండ్ వైట్ లో ఉండడం విశేషం. క్లివేజ్ షో తో పూజ హెగ్డే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక కరోనా లాక్ డౌన్ టైం లో కొంతమందికి నిత్యావసర సరుకులతో సహాయం చేసి పెద్ద మనసుని చాటుకుంది.