Advertisementt

బుల్లితెరపై అత్తగా రాశికి ఎంత గిట్టింది అంటే

Wed 16th Jun 2021 10:55 AM
big screen,small screen,rashi,raashi,janaki kalaganaledu serial  బుల్లితెరపై అత్తగా రాశికి ఎంత గిట్టింది అంటే
Remuneration for Rashi on TV? బుల్లితెరపై అత్తగా రాశికి ఎంత గిట్టింది అంటే
Advertisement
Ads by CJ

వెండితెర మీద చిన్న వయసులో మంచి కేరెక్టర్స్ చేసి.. ఆ తర్వాత హీరోయిన్ గా మారిన రాశి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకుంది. కానీ రాశి బరువు ఆమెకి శాపంగా మరింది. బాగా వెయిట్ ఉండే రాశి చాలా త్వరగా హీరోయిన్ గా ఫెడవుట్ అయ్యింది. ఆ తర్వాత నిజం సినిమాలో నెగెటివ్ కేరెక్టర్ చేసిన రాశి తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యింది. ఆతర్వాత మరోసారి సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చిన రాశి కి అమ్మ పాత్రలతో సర్దుకుపోయినా.. అవి అంత పవర్ ఫుల్ గా రాశి కి అవకాశాలు తెచ్చిపెట్టడం లేదు.

దానితో రాశి బుల్లితెర కి షిఫ్ట్ అయ్యింది. జానకి కలగనలేదు అనే సీరియల్ లో అత్త పాత్రలో రాశి కాస్త గంభీరంగా కనిపిస్తుంది. హీరోకి మదర్ కేరెక్టర్ లో కనిపిస్తున్న రాశి.. తన కోడలు పెద్దగా చదువుకోకూడదని అనుకునే మనస్తత్వం గల అత్త. తన దృష్టిలో తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అనే తత్త్వం కల అత్తగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సీరియల్ లో అత్త కేరెక్టర్ లో రాశి పెరఫార్మెన్స్ కి నిర్మాతలు వారానికి లక్ష పారితోషకం ముట్టజెబుతున్నట్లుగా తెలుస్తుంది. రాశి పాత్ర, ఆ సీరియల్ కి వస్తున్న ఆదరణతో రాశికి నెలకి నాలుగు లక్షలు పారితోషకం సెట్ చేసినట్లుగా టాక్.

Remuneration for Rashi on TV?:

Remuneration for Rashi in Janaki Kalaganaledu serial

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ