ఈ మధ్యన కోలీవుడ్ హీరో విశాల్ ప్రొడ్యూసర్ ఆర్.బి.చౌదరిపై పోలీస్ లకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాను తీసుకున్న అప్పు వడ్డీ తో సహా చెల్లించేసినా.. ఆయన మాత్రం తన దగ్గర ఉన్న ప్రామిసరీ నోటును ఇవ్వకుండా ఇబ్బందులకి గురి చేస్తున్నారంటూ విశాల్ పోలీస్ లని ఆశ్రయించాడు. ఇప్పుడు ఈ విషయం అటు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే విశాల్ చౌదరిపై కేసు పెట్టిన కొన్ని రోజులకి ఆ ఇష్యు పై ఆయన స్పందించారు. తాను విశాల్ ని ఎలాంటి ఇబ్బందులకు గురి చెయ్యలేదని ఆయన స్పష్టం చేసారు. చాలా చిన్న విషయానికి విశాల్ రాద్ధాంతం చేస్తున్నాడని అంటున్నారాయన.
ఇరుంబు తిరై సినిమా టైం లో విశాల్ మా దగ్గర కొంత అప్పుగా తీసుకున్నాడు. నేను, తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కొంత మొత్తాన్ని విశాల్‌కు అప్పుగా ఇచ్చాం. అయితే అప్పు తీసుకున్న టైం లో విశాల్ ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెట్టాడు. అవి మేము దాచాము. అయితే విశాల్ తన దగ్గర డబ్బు ఉన్న టైం లో మా అప్పు మొత్తం కట్టేసాడు. విశాల్ మాకు డబ్బు ముట్ట జెప్పినప్పుడు మేము కూడా ఓ డాక్యుమెంట్ పై సంతకం చేసి ఇచ్చాము. అయితే విశాల్ సంతకం చేసిన పేపర్స్ అన్ని డైరెక్టర్ శివ కుమార్ దగ్గర ఉండడం, ఆయన మరణించడంతో ఆ కాగితాలు ఎక్కడ ఉన్నాయో తెలియకుండా పోయాయి. ఆ విషయాన్ని విశాల్ కి చెప్పినా విశాల్ వినడం లేదు.
మా దగ్గరే దాచి పెట్టి.. తర్వాత విశాల్ ని ఇబ్బందులు పెడతామేమో అని అతను భయపడుతున్నాడు.. ఆ కాగితాలు మా దగ్గర లేనప్పుడు మేము ఏం చేయలేము. ఆ విషయం చెప్పినా విశాల్ వినడం లేదు అంటూ విశాల్ తో ఉన్న విభేదాలపై క్లారిటీ ఇచ్చారు ఆర్ బి చౌదరి.