Advertisementt

పుష్ప కి పుష్పకి మధ్యలో ఐకాన్

Sun 13th Jun 2021 12:59 PM
allu arjun,icon movie,pushpa movie,sukumar pushpa,bunny,icon allu arjun  పుష్ప కి పుష్పకి మధ్యలో ఐకాన్
Allu Arjun may not be an Icon? పుష్ప కి పుష్పకి మధ్యలో ఐకాన్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో మాస్ రోల్ పుష్ప రాజ్ గా పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్ట్స్ అనగానే సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. పార్ట్ వన్, టు లలో సుకుమార్ ఏం చూపించబోతున్నాడో అనే ఆసక్తి అందరిలో మొదలైంది. రష్మిక తో రొమాన్స్ చేస్తున్న అల్లు అర్జున్ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తో కలబడబోతున్నాడు. అయితే ఈ పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీపై అందరిలో ఆసక్తి ఉంది. అసలైతే కొరటాల శివ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ చెయ్యాల్సి ఉండగా.. కొరటాల ఇప్పుడు ఎన్టీఆర్ మూవీకి జంప్ అయ్యాడు. అయితే అల్లు అర్జున్ పుష్ప తర్వాత కాదు.. పుష్ప కి పుష్ప 2 కి మధ్యలో ఓ సినిమా చేయబోతున్నాడట.

అల్లు అర్జున్ ఎప్పుడో పక్కనబెట్టిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో ఐకాన్ మూవీ ని ఇప్పుడు అల్లు అర్జున్ చేయబోతున్నాడట. అదే విషయాన్ని గీత ఆర్ట్స్ కాంపౌండ్ నిర్మాత బన్నీ వాస్ స్పష్టతనిచ్చాడు. పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయ్యాక.. బన్నీ ఐకాన్ ప్రాజెక్ట్ మీదకి వెళతాడని.. పుష్ప పార్ట్ 2 రిలీజ్ అయ్యే లోపే బన్నీ ఐకాన్ పూర్తి చేస్తాడట. అసలు ఐకాన్ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో అనుకుంటే.. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కబోతుంది అనే న్యూస్ తో బన్నీ ఫాన్స్ ఖుషీగా ఉన్నారు. ఇక పుష్ప, ఐకాన్ కాకూండా బన్నీ మరో ముగ్గురు దర్శకులతో కమిట్ అవ్వబోతున్నాడని.. బన్నీ లైనప్ మూవీస్ మాములుగా లేదు అంటూ సోషల్ మీడియాలో న్యూస్ లు చక్కర్లు కొడుతున్నాయి. 

Allu Arjun may not be an Icon?:

ICON to separate Pushpa 1 and 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ