Advertisementt

RRR ని డిస్ క్వాలిఫై చేయండి

Fri 11th Jun 2021 03:35 PM
ycp chief whip bharat,complaint,lok sabha speaker,disqualify,mp raghu rama krishnaraja,raghu rama krishnaraja  RRR ని డిస్ క్వాలిఫై చేయండి
YCP chief whip Bharat complaint to Lok Sabha speaker to disqualify RRR RRR ని డిస్ క్వాలిఫై చేయండి
Advertisement
Ads by CJ

నరసాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు పై వైసీపీ ప్రభుత్వం కత్తి కట్టింది. మే 10 న రఘురామకృష్ణరాజున ని ఏపి సీఐడీ అరెస్ట్ చేసి దేశ ద్రోహం కేసు కింద నానాతిప్పలు పెట్టగా ఆయన సుప్రీం కోర్టు కి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రఘురామకృష్ణంరాజు పై దేశ ద్రోహం కేసు సబబే అని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఆయన ప్రస్తుతం బెయిల్ పై ఉన్నా.. ఆయనపై వైసిపి ప్రభుత్వం కక్ష సాధిస్తుంది. అందులో భాగంగానే రఘురామకృష్ణరాజును డిస్ క్వాలిఫై చేయండి అంటూ లోక్ సభ స్పీకర్ కు వైసిపి చీఫ్ విప్ భరత్ ఫిర్యాదు చేసారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ కె. రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాకు లోక్ సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు.

రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను తాము లోక్ సభ స్పీకర్ కు సమర్పించామని, అనేక పర్యాయాలు డిస్ క్వాలిఫికేషన్ కు సంబంధించి స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా ఈరోజు మరోసారి లోక్ సభ స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని శ్రీ భరత్ తెలిపారు.

YCP chief whip Bharat complaint to Lok Sabha speaker to disqualify RRR:

YCP chief whip Bharat complaint to Lok Sabha speaker to disqualify Raghu Rama Krishnaraja

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ