రామ్ చరణ్ - చిరంజీవి కాంబోలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య విడుదలై అప్పుడే నెల కావాల్సింది. కానీ కరోనా మహమ్మారి అన్ని ప్లాన్స్ ని పాడు చేసింది. ఇప్పుడు కూడా సెకండ్ వేవ్ కంట్రోల్ అవుతున్నా థర్డ్ వెవ్ ముప్పు పొంచి ఉండడంతో అందరూ కంగారు పడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడి తెలంగాణాలో లాక్ డౌన్ సడలింపులు కూడా ఎక్కువగా ఉండడంతో ఆచార్య టీం బ్యాలెన్స్ చిత్రీకరణకు సమాయత్తమవుతుందట. మరో 15 రోజుల షూటింగ్ ఫినిష్ అయితే ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది.
ఆ 15 రోజుల షూట్ కూడా రామ్ చరణ్, పూజ హెగ్డే కాంబో సీన్స్ ఫినిష్ అయినా రామ్ చరణ్ సన్నివేశాలు ఉంటాయట. అందుకే చిరు కూడా త్వరగా అన్ని సిద్ధం చేసి.. మిగతా బ్యాలెన్స్ ని అన్ని జాగ్రత్తలతో పూర్తి చెయ్యమని కొరటాలకి ఫోన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఇక షూటింగ్ ఫినిష్ కాగానే ఆచార్య రిలీజ్ డేట్ ఎనౌన్స్ చెయ్యాలని చిరు ప్లాన్ అంట. ఇప్పటికే రెండుసార్లు ఆచార్య వాయిదాపడింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆచార్య వాయిదా పడకూడదని చిరు కొరటాలని కోరినట్లుగా తెలుస్తుంది. థియేటర్స్ ఓపెన్ అయ్యి అన్ని బావున్నాయని అనుకోగానే ఆచార్య ని థియేటర్స్ లో దింపెయ్యాలని భావిస్తున్నారట.