ఈటివి లో గత ఎనిమిదేళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న కామెడీ షో జబర్దస్త్ ఇప్పటికి కామెడీ షోస్ లో రారాజే. గురువారం జబర్దస్త్ , శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్. ఇలా రెండు రోజులు రాత్రి 9.30 కి కామెడీ ప్రియులని ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఒకప్పుడు జబర్దస్త్ లో ఉన్న వారు ఇప్పుడు వెండితెర మీద వెలిగిపోతున్నవారు ఉన్నారు. ఇక జబర్దస్త్ షో ద్వారా చాలామంది కమెడియన్స్ కి లైఫ్, క్రేజు మాములుగా రాలేదు. మధ్యలో జబర్దస్త్ షో లో కాంట్రవర్సీలకు కొదవ లేదు. ఏడాదిన్నర క్రితం నాగబాబు, చమ్మక్ చంద్ర, ఆర్పీ లాంటి కమెడియన్స్ జబర్దస్త్ ని వదిలి.. అదిరింది షో కి వెళ్లిపోయారు. టాప్ కమెడియన్స్ వెళ్ళిపోయినా జబర్దస్త్ ఇప్పటికి సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతుంది. అయితే జబర్దస్త్ షో లోకి ఎంటర్ అయితే వారం, వారం పెద్ద పెద్ద పేమెంట్స్ ఉంటాయని, అందులోకి వెళ్ళడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు.
అలా వచ్చిన వారిలో ప్రసాద్ కొన్ని రోజులు టీం కంటెస్టెంట్స్ గా ఉండి తర్వాత టీం లీడర్ అయ్యి అనారోగ్య కారణాలతో జబర్దస్త్ కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే తాజాగా ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను జబర్దస్త్ కి రావడానికి కారణం షకలక శంకర్ అని చెబుతున్నాడు. అయితే జబర్దస్త్ మొదటి పారితోషకం ఎంత అని అడిగితే.. జబర్దస్త్ లో 80 ఎపిసోడ్స్ వరకు పేమెంట్స్ ఇవ్వరు. కానీ ఫుడ్, బెడ్డు, ఫోన్, బట్టలు లాంటివి అన్ని నాకు శంకరే చూసుకున్నాడు అని, తానిప్పుడు ఇలా ఉండడానికి కారణం శంకర్ అని చెబుతున్నాడు. జబర్దస్త్ ఫస్ట్, సెకండ్ బ్యాచ్ టైం లో కొత్త వారు జబర్దస్త్ టీం లీడర్స్ ని కలవడానికి గేటు ముందు పడిగాపులు కాచేవారని, కానీ ఇప్పుడు చాలా ఈజీగా కలిసిపోయి అందరితో ఫ్రెండ్లి గా ఉంటున్నారని చెప్పాడు.
ఇక జబర్దస్త్ షో లో హైయ్యెస్ట్ పేమెంట్ తీసుకునేది ఎవరు అంటే.. చమ్మక్ చంద్ర, సుధీర్ లాంటి వాళ్ళు అని, చంద్రా వెళ్ళిపోయినా.. సుధీర్, చంటి, అది లాంటి వాళ్ళకి ఎక్కువ పారితోషకాలు ఉంటాయని చెప్పాడు ప్రసాద్.