Advertisementt

నాని ఇంటిముందు బాలయ్య ఫాన్స్ రచ్చ

Thu 10th Jun 2021 02:32 PM
balakrishna fans,balakrishna,ap minister kodali nani,balayya fans,kodali nnai  నాని ఇంటిముందు బాలయ్య ఫాన్స్ రచ్చ
Balayya Fans fuss in front of Kodali Nani's house నాని ఇంటిముందు బాలయ్య ఫాన్స్ రచ్చ
Advertisement
Ads by CJ

బాలకృష్ణ పుట్టిన రోజున హుషారుగా కేక్ కటింగ్స్ చేసి ఆయన బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుందామనుకున్న ఫాన్స్ కి బాలయ్య లెటర్ నిరుత్సాహాన్ని ఇచ్చింది. అయినప్పటికీ ఆయన కొత్త సినిమాల పోస్టర్ తో ఫాన్స్ కూల్ అయ్యారు. అయితే బాలకృష్ణ ఫాన్స్ ఇప్పుడు ఏపీ మంత్రికి చుక్కలు చూపించారు. గతంలో టిడిపిలో పనిచేసి వైసిపిలో చేరి.. ఏపీలో వైసిపి ప్రభుత్వం చేపట్టాక అందులో మంత్రిగా స్థానం దక్కించుకున్న కొడాలి నాని టీడీపీ నేతలపై, చంద్రబాబు నాయుడుపై భూతులతో రెచ్చిపోతున్నాడు. అవకాశం వస్తే చాలు మీడియా ముందే నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు . అయితే సీనియర్ ఎన్టీఆర్ మీదున్న గౌరవంతో నాని ఎప్పుడూ బాలకృష్ణ జోలికి రాలేదు.

కానీ బాలయ్య టిడిపి నేతలపై నోటికొచ్చినట్లు రెచ్చిపోతున్న కొడాలి నానిపై ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు.. ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా బాలయ్య పుట్టిన రోజునాడు బాలయ్య ఫాన్స్ కొడాలి నాని ఇంటి ముందు రచ్చ రచ్చ చేసారు. కొడాలి నాని పై భూతులతో రెచ్చిపోతూ బాలయ్య ఫాన్స్ నినాదాలు చేసారు. కొడాలి నానిపై బాలయ్య ఫాన్స్ రెచ్చిపోవడమే కాదు.. ఆ వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. మరి నాని ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

Balayya Fans fuss in front of Kodali Nani's house:

Balakrishna fans vs Kodali Nnai 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ