గ్లామర్ క్వీన్ సమంత అక్కినేని రేంజ్ పెళ్ళయాక ఏమాత్రం తగ్గకపోగా.. మరింతగా పెరిగిపోయింది. ఆమె పెళ్లి తర్వాత చేసిన సినిమాలన్నీ మంచి హిట్ అవడంతో సమంత కి ఇప్పటికి మంచి మర్కెట్ ఉంది. తెలుగులోనే కాదు కోలీవుడ్ లోను మంచి క్రేజ్ ఉన్న సమంత ఈమధ్యనే హిందీలోనూ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సీరీస్ లో రాజి గా సమంత నటనకు అందరూ జేజేలు పలుకుతున్నారు. రాజి పాత్రలో యాక్షన్ కూడా ఇరగదీసిన సమంతకి ఈ సీరీస్ లో నటించినందుకు ఎంత ముట్టిందో తెలుసా.. జస్ట్ మూడున్నర నుండి నాలుగు కోట్లేనట. ఫస్ట్ టైం డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఫ్యామిలీ మ్యాన్ తోనే దుమ్మురేపింది.
ఈ సీరీస్ లో మెయిన్ లీడ్ లో నటించిన మనోజ్ భాజపేయీ కి రెండు సీజన్స్ కి కలిపి పది కోట్ల పారితోషకం ఇచ్చారట. అంటే సీజన్ వైస్ గా ఐదు కోట్లన్నమాట. ఇక ఆ తర్వాత ప్లేస్ లో సమంత ఉండగా.. ఈ సీరీస్ లో శ్రీకాంత్ తివారి వైఫ్ గా సుచి పాత్రలో నటించిన ప్రియమణికి మొదటి సీజన్ కి 80 లక్షలు, రెండో సీజన్ కి 90 లక్షలు ఇచ్చారట. అయితే సమంత రేంజ్ కి నాలుగు కోట్ల ఫిగర్ తక్కువే అంటూ సౌత్ మీడియాలో కథనాలు వస్తున్నా.. సమంత మాత్రం తన పాత్రకి వస్తున్న ప్రశంశలతో ఫుల్ హ్యాపీ గా ఉందట. అందుకే పారితోషకాన్ని లెక్కల్లోకి తీసుకోవడం లేదట సమంత. నిజంగా సమంత గ్రేట్ కదా అంటున్నారు ఆమె ఫాన్స్.