Advertisementt

పని లేదు.. పన్ను కట్టలేదు అంటున్న హీరోయిన్

Thu 10th Jun 2021 12:46 PM
bollywood beauty,bollywood,controversial queen,kangana ranaut,thalaivi,tejas  పని లేదు.. పన్ను కట్టలేదు అంటున్న హీరోయిన్
Kagana has disclosed that she did not pay her tax పని లేదు.. పన్ను కట్టలేదు అంటున్న హీరోయిన్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో విషయంలో హైలెట్ అవుతూనే ఉంటుంది. ముంబై లో శివసేన ప్రభుత్వం తో ఢీ అంటే ఢీ అంటున్న కంగనాపై ట్విట్టర్ శాశ్వత బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ పై, బెంగాల్ అల్లర్లపై హాట్ కామెంట్స్ చేసిన కంగనా రనౌత్ పై ట్విట్టర్ బ్యాన్ విధించింది. అయితే తాజాగా కంగనా తాను ఇన్ కం టాక్స్ పే చెయ్యడంలో ముందు ఉంటాను అని, అత్యధిక మొత్తంలో పన్ను చెల్లించే నటి తానేనని చెబుతుంది. తన ఆదాయంలో దాదాపుగా 45 శాతం వరకు  తాను పన్నుల రూపంలో కడుతున్నట్టుగా చెబుతుంది కంగనా.

అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ వలన పనులు లేని కారణంగా అంటే షూటింగ్స్ అన్ని బంద్ ఉండడంతో తన ఆదాయానికి గండి పడింది అని, ప్రస్తుతం పని లేకపోవడంతో చేతిలో డబ్బులు లేక ఇంకా తాను సగం పన్నుని చెల్లించలేకపోయాను అని దానితో అదనపు ఛార్జీలు కట్టాల్సివుంది అని చెప్పిన కంగనా.. అయినప్పటికీ తాను అదనపు చార్జీలు కట్టేందుకు రెడీగా ఉన్నాను.. దానిని అంగీకరిస్తున్నాను అని చెబుతుంది. అయితే ఇంతవరకు ఇలా పన్నులు లేట్ గా కట్టడమనేది తన లైఫ్ లోనే ఫస్ట్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టింది కంగనా రౌనత్ 

Kagana has disclosed that she did not pay her tax:

No work for Kangana, unable to pay taxes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ