మెగా హీరోలందరికీ మెగాస్టార్ చిరంజీవే ఆరాధ్య దైవం, ఇష్టమైన హీరో, అభిమానంచే హీరో. కానీ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి మాత్రం వేరే హీరో అంటే వల్లమాలిన అభిమానం అంటున్నాడు. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ క్రేజ్ మాములుగా లేదు. ఉప్పెన హిట్ తో వైష్ణవ తేజ్ వరస సినిమా కమిట్మెంట్స్ తో బిజీ హీరోగా మారిపోయాడు. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన ఈ మెగా హీరో తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసాడు. ఆ సెషన్ లో తనకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు అనగానే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా అని చెప్పడమే కాదు.. సోనాక్షిని ప్రేమిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.
అలాగే పవన్ కళ్యాణ్ సినిమాల్లో తనకు తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలు అంటే ఇష్టమని చెప్పాడు వైష్ణవ తేజ్. ఇక అభిమానులు మీకు అత్యంత ఇష్టమైన హీరో అని అడగగానే వైష్ణవ్ తేజ్ తన పెద్ద మామ, మెగాస్టార్ చిరు పేరు చెబుతాడని ఫాన్స్ ఎక్సపెక్ట్ చేసారు. కానీ వైష్ణవ్ తేజ్ మాత్రం తనకి సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఇష్టమని చెప్పి ఫాన్స్ కి షాకిచ్చాడు. తన మావయ్య అంటే ఇష్టమైనా తనకి ఫెవరెట్ హీరో మాత్రం రజినీకాంత్ అంటూ చెప్పి వైష్ణవ్ తేజ్ అభిమానులకి మాములుగా షాకివ్వలేదు. దెబ్బకి ఫాన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యింది వైష్ణవ్ ఆన్సర్ విని.