బాలకృష్ణ పుట్టిన రోజు రేపు. జూన్ 10 న బాలయ్య బర్త్ డే సందర్భంగా ఆయన ఫాన్స్ కేక్ కటింగ్స్, బర్త్ డే సెలెబ్రేషన్స్ అంటూ హడావిడి చేద్దామంటే బాలకృష్ణ ప్రత్యేకంగా ఫాన్స్ కి లెటర్ రాసి.. సెలెబ్రేషన్స్ వద్దన్నారు. ఇక ఆయన నటిస్తున్న సినిమాల నుండి సర్ప్రైజ్ లు మాత్రం బాలకృష్ణ ఫాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే బాలయ్య కి స్పెషల్ బర్త్ డే విషెస్ చెబుతూ అఖండ నుండి స్పషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. ఆ పోస్టర్ లో కూల్ గా బాలయ్య చాలా అంటే చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. బాలయ్య అఖండ లుక్ తో ఫాన్స్ హ్యాపీ.
ఇక బాలకృష్ణ - మైత్రి మూవీ మేకర్స్ - గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కబోయే మూవీ అప్ డేట్ రేపు ఉదయం 8.45 నిమిషాలకు రివీల్ చెయ్యనున్నారు. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా NBK107 సినిమాకు సంబంధించిన ఓ అదిరిపోయే అప్టేట్‌ను రేపు ఉదయం 8.45 నిమిషాలకు రివీల్ చేయనున్నట్లుగా మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చెయ్యడంతో.. బాలయ్య ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. మైత్రి వారు ఇవ్వబోయే ఆ సర్ప్రైజ్ ఏమిటో అంటూ అప్పుడే బాలయ్య ఫాన్స్ లో ఆత్రుత మొదలైపోయింది.