Advertisementt

వాళ్ళ లవ్ ని బయట పెట్టిన హర్షవర్ధన్

Wed 09th Jun 2021 08:08 PM
katrina kaif,uri fame vicky kaushal,harshavardhan kumar  వాళ్ళ లవ్ ని బయట పెట్టిన హర్షవర్ధన్
Vicky is dating Katrina వాళ్ళ లవ్ ని బయట పెట్టిన హర్షవర్ధన్
Advertisement
Ads by CJ

 

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ఎప్పటినుండో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, గ్లామర్ గర్ల్ కత్రినా కైఫ్ తో డేటింగ్ లో ఉన్నాడనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ యంగ్ హీరో తరుచూ కత్రినాని కలిసేందుకు ఆమె ఇంటికి వెళుతూ కెమెరాలకు దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి. పబ్లిక్ గా ఫోకస్ కానీ ఈ జంట డేటింగ్ పై బి టౌన్ కోడై కూస్తుంది. లాక్ డౌన్ లోను విక్కీ కౌశల్ - కత్రినా కలిసే ఉంటున్నారని, గతంలోనూ రెస్టారెంట్స్ కి, పార్టీలకి కలిసే తిరిగేవారిని మీడియాలో న్యూస్ వచ్చినా ఈ జంట ఎక్కడా తమ ఎఫ్ఫైర్ పై స్పందించలేదు. అయితే తాజాగా వీరిద్దరూ లవ్ లో ఉన్నట్లుగా మరో నటుడు హర్షవర్ధన్ కపూర్ కన్ ఫర్మ్ చేసినట్లే అనిపిస్తుంది. 

హర్షవర్ధన్ కపూర్ ఓ షో లో పాల్గొన్నప్పుడు విక్కీ కౌశల్ - కత్రినా మధ్యన ఎఫ్ఫైర్ నడుస్తున్నట్లుగా, డేటింగ్ లో ఉన్నట్లుగా కన్ ఫర్మ్ చెయ్యడంతో సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురుస్తుంది. హర్షవర్ధన్ కపూర్ షో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ రోజు ఉదయం నుండి విక్కీ కౌశల్ ట్విట్టెర్ లో ట్రెండ్ అవుతున్నాడు. ఆయన అభిమానులు, కత్రినా కైఫ్ అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్స్ తో విక్కీ కౌశల్ ని ట్రేండింగ్ లో ఉంచారు. మరి ఈ లెక్కన ఈ జంట బయటికి చెప్పకపోయినా సీక్రెట్ డేటింగ్ వ్యవహారం ఇలా బయటికి వచ్చింది. ఇక విక్కీ కౌశల్ నాలుగైదు బడా ప్రాజెక్ట్స్ తో బాగా బిజీగా వున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ వేళ ప్రియురాలు కత్రినాతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.

Vicky is dating Katrina:

Confirmed: Katrina is dating Uri hero Vicky Kaushal

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ