Advertisementt

బాలయ్య బర్త్ డే స్పెషల్ వచ్చేసింది

Wed 09th Jun 2021 04:48 PM
balakrishna,balayya birthday special,balakrishna birthday poster,akhanda movie. akhanda movie poster  బాలయ్య బర్త్ డే స్పెషల్ వచ్చేసింది
Balakrishna Birthday Special Poster From Akhanda Movie బాలయ్య బర్త్ డే స్పెషల్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

సింహా, లెజెండ్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయాల త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ‌. అఖండ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అఖండ టీజర్ మరింతగా పెంచేసింది. యూట్యూబ్ లో బాలయ్య అఖండ టీజర్ ఇప్పటికి దూసుకుపోతుంది. ఇక ఈరోజు అఖండ నుండి బాలయ్య బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తామని చెప్పినప్పటినుండి ఫాన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

మాట ఇచ్చినట్టుగానే గురువారం (జూన్ 10న) బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం 04:36 గంటలకు కొత్త పోస్టర్ విడుదల చేశారు. దీనికి ప్రేక్షకులు, అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నందమూరి అభిమానుల్లో పోస్టర్ విడుదలతో ముందుగా పుట్టినరోజు సంబరాలు మొదలయ్యాయి. ఆల్రెడీ టైటిల్ రోర్ పేరుతో విడుదలైన అఖండ టీజర్ కేవ‌లం 16రోజుల్లోనే 50మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్‌ని సాధించి టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 50మిలియ‌న్స్ వ్యూస్ సాధించిన టీజ‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. మా హీరో నందమూరి బాలకృష్ణగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అభిమానులకు పుట్టినరోజు కానుకగా పోస్టర్ విడుదల చేశాం. అఖండ టైటిల్ రోర్‌తో ప్రేక్ష‌కుల‌లో, అభిమానుల్లో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. వాటిని అందుకునేలా బోయపాటి శ్రీను గారు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. కొంతే బ్యాలన్స్ ఉంది. అతి త్వరలో చిత్రీకరణ మొదలుపెడతాం. షూటింగ్ కంప్లీట్ అయ్యాక విడుదల తేదీ ప్రకటిస్తాం. శుభముహూర్తాన సినిమాను ప్రేక్షకదేవుళ్ళ ముందుకు తీసుకొస్తాం అని అన్నారు. 

Balakrishna Birthday Special Poster From Akhanda Movie:

Balakrishna Birthday Poster From Akhanda Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ