కరోనా సెకండ్ వేవ్ సినిమా ఇండస్ట్రీని మరోసారి అతలాకుతలం చేసింది. సినిమా షూటింగ్స్ నిలిచిపోవడం కన్నా సినిమా రిలీజ్ లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఏప్రిల్ 10 తర్వాత రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్ని థియేటర్స్ లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూలతో థియేటర్స్ మొత్తం బంద్ అవడంతో రిలీజ్ లు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఖచ్చితంగా రెండు నెలలు అయ్యింది.. థియేటర్స్ బంద్ అయ్యి, థియేటర్స్ లో బొమ్మ పడి. ప్రస్తుతం తెలంగాణాలో ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలవుతున్నాయి. జూన్ 20 వరకు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు ఆంక్షలు సడలింపులు రావడంతో మరోసారి షూటింగ్స్ జాతర మొదలుకాబోతుంది.
ఇక జూన్ నెలాఖరు వరకు ఈ లాక్ డౌన్, కర్ఫ్యూ, సడలింపులు ఉన్నా.. జులై నుండి పూర్తిగా అన్ లాక్ ఉంటుంది అని, అలా థియేటర్స్ కూడా ఓపెన్ కావొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అంటే జులై నుండి మళ్ళీ సినిమాల రిలీజ్ ల హడావిడి మొదలవుతున్నట్టే. లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం ఇలా రిలీజ్ కి రెడీగా ఉన్నా మూవీస్ వరసగా థియేటర్స్ కి రావడం పక్కాగా కనిపిస్తుంది. కరోనా కేసులు భారీగా తగ్గడం.. జనాల్లో కాస్త భయం పోవడంతో మరోసారి బాక్సాఫీసు జాతర మొదలు కాబోతున్నట్టే అంటున్నారు. జులై లో థియేటర్స్ లో ఓపెన్ అయ్యి ప్రేక్షకుల సందడిని బట్టి తమ సినిమాల రిలీజ్ డేట్స్ ఇచ్చే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.