Advertisementt

ఆశుతో కలిసి సర్ప్రైజ్ అంటున్న రాహుల్

Tue 08th Jun 2021 10:42 PM
rahul sipligunj,ashu reddy,rahul sipligunj surprise announcement soon - ashu reddy loves,rahul sipligunj surprise announcement soon - ashu reddy marriage,rahul surprise,announcement soon  ఆశుతో కలిసి సర్ప్రైజ్ అంటున్న రాహుల్
Rahul Sipligunj sudden surprise ఆశుతో కలిసి సర్ప్రైజ్ అంటున్న రాహుల్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా బయటికి వచ్చిన సింగర్ రాహుల్ సిలీగంజ్ ఆ తర్వాత ఆల్బమ్స్ తోను, పాటలతోను, బట్టల షాప్ బ్రాంచెస్ తోనూ బాగా బిజీ అయ్యాడు. బిగ్ బాస్ లోనే పునర్నవి తో లవ్ ట్రాక్ నడిపిన  రాహుల్ ఆ తర్వాత  అంటే బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక పునర్నవిని పెళ్లి చేసుకుంటాడు అనుకున్నారు. పొన్ను కూడా రాహుల్ తో మంచి ట్రాక్ నడిపింది. అయితే బిగ్ బాస్ తర్వాత పునర్నవి - రాహుల్ వేరువేరుగా ఉండిపోయారు కానీ కలిసి కనబడింది లేదు. అంటే రాహుల్ కి పునర్నవి మధ్యన ఎలాంటి సం థింగ్ లేదని తేల్చేసారు. ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆశు రెడ్డి తో ప్రేమాయణం నడుపుతున్నాడని, అందుకే ఓపెన్ గానే ఇద్దరు కలిసి కలిసి తిరగడం, ఫోటో షూట్స్ తో రెచ్చిపోతున్నారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది.,

నిజంగా ఆ ప్రచారానికి ఊతమిస్తూ రాహుల్ సిప్లిగంజ్ తాజాగా పెట్టిన పోస్ట్ ఉంది. ఆశు రెడ్డి తో కలిసి హాగ్ చేసుకుని క్లోజ్ ఉన్న ఫోటో ని పోస్ట్ చేస్తూ సర్ప్రైజ్ అనౌన్సమెంట్.. ఆశు రెడ్డి తో కలిసి అంటూ సోషల్ మీడియాలో పిక్ ని షేర్ చేసాడు. మధ్యలో లవ్ సింబల్ కూడా ఉండడంతో రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ పెళ్లి మేటర్ నే చెప్పబోతున్నాడని, త్వరలోనే నిశ్చితార్ధం చేసుకోవడానికి రాహుల్ సిప్లిగంజ్ రెడీ అవుతున్నాడు కాబట్టే ఈ పోస్ట్ పెట్టాడు. అందులోనూ ఆశు రెడ్డి తో కలిసి సర్ప్రైజ్ అంటే వాళ్ళ పెళ్లి విషయం కాక ఇంకేం ఉంటుంది అంటున్నారు నెటిజెన్స్. రాహుల్ Surprise announcement!❤️ with #ashureddy అంటూ పోస్ట్ చెయ్యడంతో రాహుల్ కి ఆశు కి అందరూ కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. 

Rahul Sipligunj sudden surprise :

Rahul Sipligunj surprise announcement soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ