శృతి హాసన్ - తమన్నాలు ఎంతమంచి ఫ్రెండ్స్ అనేది తరుచూ చూస్తూనే ఉంటాము. అలాగే వాళ్ళ ఫ్రెండ్ షిప్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతూనే ఉంటుంది. కోలీవుడ్ లో శృతి హాసన్, టాలీవుడ్ లో తమన్నా తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగానే ఉన్నారు. అయితే శృతి హాసన్ ధైర్యం గురించి తమన్నా కామెంట్స్ ఒక్కసారి చుడండి. శృతి హాసన్ నేను మంచి ఫ్రెండ్స్. మేము ఎక్కువగా కలుస్తూనే ఉంటాము. అంతేకాదు ఎక్కువగా ఫోన్ కూడా చేసుకుంటాము. మా ఇద్దరి మధ్యన పెద్దగా దాపరికాలు ఉండవు.
అయితే శృతి హాసన్ కి చాలా ధైర్యం, ఏ విషయంలో అయినా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. ఒక వైపు సినిమా షూటింగ్స్ చేస్తూనే మరోవైపు ఇంటి పనులతో బిజీగా ఉంటుంది, అంతేకాదు శృతి హాసన్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అందరికి ఇలా ఉండడం సాధ్యం కాదు. ఇక శృతి హాసన్ ఏ విషయాన్నీ అయినా లైట్ తీసుకుంటుంది. అంతేకాదు ఎవరితోనైనా సరదాగా మాట్లాడుతుంది. శృతి హాసన్ లా ఉండడం అందరికి సాధ్యపడదు. నేను ఫీలయిన సందర్భం ఏదైనా ఉంది అంటే వెంటనే శృతి హాసన్ కి ఫోన్ చేస్తాను తానే నాకు ధైర్యం చెబుతుంది అని.. తన ఫ్రెండ్ గురించి ఆమె ధైర్యం గురించి ఇలా చెప్పుకొచ్చింది తమన్నా.