Advertisementt

ప్రియమణికి అన్యాయం చేసారు

Mon 07th Jun 2021 08:24 PM
family man 2,manoj bajpayee,priyamani,samantha,fine sequel  ప్రియమణికి అన్యాయం చేసారు
Family man 2 success credit goes to Srikanth Tiwari and Raji ప్రియమణికి అన్యాయం చేసారు
Advertisement
Ads by CJ

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ సీజన్ వన్ లో మనోజ్ బాజ్ పేయి, ప్రియమణి కలిసి భర్య భర్తలుగా నటించారు. ఆ సీజన్ లో శ్రీకాంత్ తివారీగా TASCలో తన నిధులు నిర్వర్తిస్తూనే ఫ్యామిలీ మ్యాన్ గా తన వైఫ్, పిల్లలతో సమయం గడుపుతాడు. అయితే ప్రియమణి సుచి కేరెక్టర్ లో ఇటు ఇంటిని, అటు తాను వర్క్ చేసే ఆఫీస్ ని రెండిటిని మ్యానేజ్ చేసుకుంటుంది. ఇక ప్రియమణి కి స్పేస్ కూడా సీజన్1 లో ఎక్కువ ఉంటుంది. అరవింద్ - ప్రియమణి ఎపిసోడ్, అలాగే లూనావానాలో జరిగిన ఘటన ఇవన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే సీజన్ 2 కి వచ్చేసరికి ప్రియమణి ప్రాధాన్యత తగ్గిపోయింది.

ఎక్కువగా శ్రీకాంత్ తివారి, రాజి పాత్రధారి సమంత చుట్టూ నే తిరుగుతుంది. ప్రియమణి జాబ్ చేసినా, ఆమె ఇంట్లో ఉన్నా అంతగా ప్రాధాన్యత లేదు. అలాగే ప్రియమణి లుక్స్, ఆమె ఉన్న సీన్స్ అంత ఆసక్తికరంగా లేవు. ఫ్యామిలీ మ్యాన్ క్రెడిట్ మొత్తం మనోజ్ భాజపేయీ, సమంత లే పట్టుకుపోయారు. ఫ్యామిలీ మ్యాన్ లో ఫ్యామిలీ డ్రామా చాలా తక్కువగా కనిపిస్తుంది. ప్రియమణి ఎక్కువగా మూడీగా ఉండడమే ఈ సీజన్ లో చూపించారు. కాకపోతే  ఫన్నీ మూమెంట్స్ చాలానే ఉన్నాయి. ఈసారి ఆ క్రెడిట్ శ్రీకాంత్ తివారి కొడుకుగా చేసిన పిల్లోడికి దక్కింది అనే చెప్పాలి. ఏది ఏమైనా సీజన్ వన్ తో పోలిస్తే సీజన్ 2 లో ప్రియమణికి అన్యాయం జరిగింది అనే చెప్పాలి.

Family man 2 success credit goes to Srikanth Tiwari and Raji:

Family man 2: Manoj Bajpayee, Priyamani and Samantha stun in a fine sequel

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ