నటుడు శ్రీహరి అంటే వెంటనే ఒక క్రూరమైన విలన్ గుర్తుకు వస్తాడు. శ్రీహరి చాలా సినిమాలో విలన్ పాత్రలతోనే హైలెట్ అయ్యాడు. తర్వాత కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను శ్రీహరికి పేరుంది. అలాగే కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించాడు. అయితే శ్రీహరి కొంతకాలం క్రితం అనారోగ్య కారణాల వలన కన్నుమూసిన విషయం తెలిసిందే. శ్రీహరి బ్రతికున్నపుడు చాలామందికి సహాయం చేసాడు. శ్రీహరి కూతురు అక్షర చిన్నప్పుడే మరణించడంతో ఆమె పేరు మీద దానధర్మాలు, పేద విద్యార్థుల చదువు, ఇలా చాలా విషయంలో శ్రీహరి తన సేవాగుణాన్ని చాటుకున్నారు.
అంత గొప్ప సేవాగుణం ఉన్న శ్రీహరి కేరెక్టర్ ఎలాంటిదో, ఆయన మంచితనం ఎలా ఉంటుందో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి మాటల్లో.. శ్రీహరి సహాయం కోరి.. బాధల్లో ఉన్నవారు శ్రీహరి ఇంటి ముందుకు వస్తే.. శ్రీహరి కొంత డబ్బుని మూటలో కట్టి ఆయన ఇంటి బాల్కనీ నుండి వాటిని రోడ్డు మీదకి విసిరేసేవారని, ఆ డబ్బు తీసుకున్న వారు కృతజ్ఞతతో శ్రీహరికి దణ్ణం పెట్టేవారని, శ్రీహరి మంచి తనం, ఆయన అంత గొప్పవాడంటూ పృథ్వి ఓ షో లో చెప్పుకొచ్చాడు.