టీడీపీ పార్టీకి తెలంగాణలో చిన్న హోప్ కూడా లేదు. టిటిడిపి లో ఒక్క పిట్టా మిగల్లేదు. బడా నేతలంతా టీఆరెస్ ప్రభుత్వం రాగానే జంప్ అయ్యారు. ఇక మిగిలిన రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబుతో పొసగక కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఇక సీనియర్ నాయకులూ ఇలా ఎవరూ మిగలని పార్టీకి ఏకైన నేతగా ఎల్ రమణ మత్రమే కొనసాగుతున్నారు. టిటిడిపి అధ్యక్షుడిగా కొనసాగుతున్న రమణ ఇప్పటివరకు టీడీపీకి నమ్మిన బంటుగానే ఉన్నాడు. అయితే తాజాగా రమణ కూడా ఇప్పుడు టీటీడీపిని వదిలి టీఆరెస్ లోకి వెళ్ళిపోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.
రమణ గులాబీ తీర్థం పుచ్చుకోబోతున్నాడనే ప్రచారం జరగడమే కాదు.. టీఆరెస్ లోకి రమణని లాగెయ్యడానికి టీఆరెస్ పెద్ద స్కెచ్చే వేసినట్టుగా తెలుస్తుంది. బీసీ సామాజికవర్గాల్లోనూ, కరీంనగర్ జిల్లాలోనూ రమణకు మంచి గుర్తింపు, పలుకుబడి ఉంది. అందుకే రమణని టీఆరెస్ లోకి లాగేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయట. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే సంజయ్ లు ఎల్ రమణ తోచర్చలు జరిపి టీఆరెస్ లోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఒక పక్క ఈటెల టీఆరెస్ కి రాజీనామా చెయ్యడంతో ఇప్పడు రమణ టీఆరెస్ కి వస్తే మరింత బలం పెంచుకోవచ్చని టీఆరెస్ వ్యూహంగా చెబుతున్నారు. మరి రమణ గనక గులాబీ గూటికి చేరితే తెలంగాణాలో టిటిడిపి పూర్తిగా కనుమరుగైనట్టే.