ఏప్రిల్ చివరి వారం నుండి ఢిల్లీ, మహారాష్ట్రలో మహా జనతా కర్ఫ్యూ, ఢిల్లీలో లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు, కరోన సెకండ్ వేవ్ ముప్పు ఆ రెండు రాష్ట్రాలని గజగజ వణికించేశాయి. దానితో పటిష్టమైన లాక్ డౌన్, కర్ఫ్యూలని అమలులోకి తేవడంతో అక్కడ కరోనా సెకండ్ వేవ్ కంట్రోల్ లోకి వచ్చి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దానితో అటు ఢిల్లీ ఇటు మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు నుండి అన్ లాక్ ప్రక్రియ ప్రారంభించాయి. ఐదు అంచెల అన్ లాక్ ప్రక్రియ ని మహారాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఢిల్లీ లో ఆంక్షల సడలింపు పెంచింది.
గత నెలన్నర రోజులుగా ఇళ్లకే పరిమితమైం ఢిల్లీ, మహారాష్ట్ర ప్రజలు అన్ లాక్ ప్రక్రియతో భారీగా రోడ్ల మీదకి చేరుకుంటున్నారు. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా జనాలు కనిపిస్తుంటే.. లాక్ డౌన్ పెట్టి ఎంతో శ్రమించినా ఈ అన్ లాక్ ప్రక్రియతో శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అయినట్లుగా ఉంది. కరోనా భయంతో ప్రజల్లో మార్పు రాలేదు అని, ఇలా గుంపులు గుంపులుగా ఉండడం వలన పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుంది అంటూ నిపుణుల హెచ్చరికలు ప్రజలు భేఖాతర్ చెయ్యడం థర్డ్ వెవ్ ముప్పుని అతి త్వరలో ఎదుర్కుంటామేమో అనే భయాలను వ్యక్తం చేస్తున్నారు వారు. అన్ లాక్ ప్రక్రియ మొదలైన ప్రజలు సోషల్ డిస్టెన్స్ మెయింటింగ్ చేస్తూ ఉంటేనే కరోనా నుండి బయటపడతామని చెప్పినా ప్రజల్లో మార్పురావడం లేదంటే ఏం చెప్పాలి.