Advertisementt

సెకండ్ వేవ్ భీభత్సం.. యంగ్ హీరో అనుభవం

Mon 07th Jun 2021 01:04 PM
nikhil,hero nikhil,nikhil fires,hospital bills,corona,covid 19,corona second wave  సెకండ్ వేవ్ భీభత్సం.. యంగ్ హీరో అనుభవం
Nikhil Siddhartha helps out people with medical emergencies సెకండ్ వేవ్ భీభత్సం.. యంగ్ హీరో అనుభవం
Advertisement
Ads by CJ

కరోనా ఫస్ట్ వెవ్ జస్ట్ జనాలని భయపెట్టింది. అప్పట్లో హాస్పిటల్ ఖర్చు కానీ, ఆక్సిజెన్ సిలిండర్లు కానీ, బెడ్స్ విషయం కానీ అంతగా అవసరపడలేదు. కానీ కరోనా సెకండ్ వేవ్ జనాల్ని భయబ్రాంతులకు గురి చేసింది. వేలల్లో ప్రాణాలు కోల్పోయారు. లక్షల్లో హాస్పిటల్ పాలయ్యారు. ఆక్సిజెన్ లేక, బెడ్స్ దొరక్క, మెడిసిన్ లేక ఇలా బోలెడంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇక సెలబ్రిటీస్ నుండి చాలామందికి సాయం అందింది. సోను సూద్, చిరు లాంటి వాళ్ళే కాదు చాలామంది హీరోలు, హీరోయిన్స్ తమకి తోచిన సహాయం చేసారు. అందులో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కూడా ఉన్నాడు.

ఎంతోమందికి మెడిసిన్, ఆక్సిజెన్ సిలిండర్స్, అవసరమైన వారికీ బెడ్స్ సహాయం చేసాడు. తాజాగా సెకండ్ వేవ్ భీభత్సం పై నిఖిల్ స్పందిస్తూ.. సెకండ్ వెవ్ స్టార్ట్ అయినప్పుడే నేను నా సినిమా షూటింగ్స్ ఆపేసి ఇంటికి పరిమితమయ్యాను. మాలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో కూర్చున్నా గడుస్తుంది. కానీ చాలామందికి అలా కాదు. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వారికీ నేను చేయగలిగినంత సహాయం చేశాను. గత ఏడాది కన్నా ఈ ఏడాది హాస్పిటల్స్ లో చేరిన వారి సంఖ్య ఎక్కువ. బోలెడంత డబ్బు వదిలించుకోవాల్సి వస్తుంది. కొన్ని హాస్పిటల్స్ మితి మీరి బిల్స్ వేసి కరోనా పేషేంట్స్ ని పిండేశాయంటూ నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. డబ్బు ఉన్నా ఏం చెయ్యలేని పరిస్థితి. బెడ్లు, వెంటిలేట‌ర్లు, యాంటీ ఫంగ‌ల్ మెడిస‌న్‌, ఇంజెక్ష‌న్లు ల‌భించ‌డం చాలా క‌ష్టంతో కూడుకున్న విష‌యం. 

ఈ కష్ట సమయంలో కొత్త పరిచయాలే డబ్బుతో సమానం. సోషల్ మీడియా ద్వారా చాలామందికి సహాయం చేస్తూ ఓ ఫార్మా కంపెనీ తో పరిచయం చేసుకుని, దాని ద్వారా చాలామందికి ఇంజెక్ష‌న్లు ఏర్పాటు చేశాను. రోజుకి కొన్నివేల మంది నన్ను టాగ్ చేస్తూ సహాయం కోరినా.. నేను రోజుకి 50 మందికి మాత్రమే సహాయం చేయగలిగాను. అయితే ఒకప్పుడు వేలల్లో వచ్చే ట్వీట్స్.. ఇప్పుడు తగ్గాయి. అంటూ సెకండ్ భీభత్సంపై నిఖిల్ చెప్పుకొచ్చాడు.

Nikhil Siddhartha helps out people with medical emergencies:

Nikhil Fires On Hospital Bills

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ