Advertisementt

హీరోలపై కన్నడ డైరెక్టర్ సన్సేషనల్ కామెంట్స్

Sun 06th Jun 2021 10:22 PM
kannada director prashanth neel,prashanth neel,star heroes,ntr,ntr31,prabhas,salaar,kgf 2  హీరోలపై కన్నడ డైరెక్టర్ సన్సేషనల్ కామెంట్స్
Prashanth neel about Star heroes హీరోలపై కన్నడ డైరెక్టర్ సన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

కెజిఎఫ్ సంచలనం ప్రశాంత్ నీల్ మరో రెండు నెలలో కెజిఎఫ్ చాప్టర్ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం చూసి తెలుగు హీరోలు ఆయన వెంట పడ్డారు. అయితే కెజిఎఫ్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని ప్రశాంత్ నీల్ తెలుగు హీరోలతో సినిమాలు కమిట్ అవుతున్నప్పుడు కన్నడ ప్రేక్షకులు ఆయన్ని ద్వేషించారు. ఇక్కడ పేరు తెచ్చుకుని.. దాన్ని తెలుగు హీరోలకి వాడతావా అంటూ ప్రశాంత్ నీల్ ని ట్రోల్ చేసారు. కెజిఎఫ్ 2 తర్వాత ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తూ ప్రభాస్ ని మాస్ గా ఎలివేట్ చెయ్యబోతున్నాడు. ఆతర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో NTR31 చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. 

ఎన్టీఆర్, ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సినిమాలు కమిట్ అయ్యారా? లేదంటే ప్రశాంత్ నీలే టాలీవుడ్ స్టార్ హీరోలని కలిసి కథ వినిపించి ఓకె చేసుకున్నారా? అప్పుడెప్పుడో కెజిఎఫ్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుతున్నప్పడు ఎన్టీఆర్ తో లంచ్ పార్టీ అన్నారు. మళ్ళీ ఈమధ్యన అల్లు అర్జున్ తో గీత ఆర్ట్స్ ఆఫీస్ లో ప్రశాంత్ నీల్ కథా ముచ్చట్లు పెట్టినట్లుగా వార్తలొచ్చాయి. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం తానేమి స్టార్ హీరోల వెంట పడలేదు అని,  నేను ఎప్పుడూ నా కథలకి హీరోలని సెలెక్ట్ చేసుకోను. స్టార్ హీరోలే తనతో సినిమాలు చేసునేందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అదే స్టార్ హీరోల తో సినిమా కమిట్ అవ్వగానే నా బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. అలాగే కథ ఆ హీరోల లేవల్లోనే ఉంటుంది అంటూ స్టార్ హీరోల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.

Prashanth neel about Star heroes:

Kannada Director Prashanth neel about Star heroes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ