ఇప్పుడు ఏ భాషలో అయినా బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. హిందీలో మొదలైన బిగ్ బాస్ ఇప్పడు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ నాలుగు సీజన్స్ ని పూర్తి చేసుకుంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఏకంగా 14 సీజన్స్ ని పూర్తి చేసుకుని 15 వ సీజన్ కోసం రెడీ కాబోతుంది. అయితే నార్త్ లో బిగ్ బాస్ కోచ్చిన క్రేజు, ఫెము, ఇతర భాషల్లో లేదనే చెప్పాలి. అక్కడ బిగ్ బాస్ లో పాల్గొనే సెలబ్రిటీస్ బయటికొచ్చాక కూడా క్రేజీ ఆఫర్స్ దూసుకుపోతున్నారు. అయితే అలాంటి బిగ్ బాస్ లో సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, అలాగే పవన్ హీరోయిన్ భూమికలు సీజన్ 15 లో పాల్గొనబోతున్నారనే ప్రచారం జరుగుతుంది.
అయితే రియా చక్రవర్తి సంగతి ఎలా ఉన్నా.. భూమిక లైన్ లోకొచ్చేసింది. తనని బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించలేదని, వాళ్ళు పిలిచినా తాను వెళ్ళను అని తెగేసి చెబుతుంది. బిగ్ బాస్ లో నేను అడుగుపెడుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, బిగ్ బాస్ మొదలైన కొత్తల్లో, ఆ తర్వాత కూడా కొన్ని సీజన్స్ కి తనని సంప్రదించారని, కానీ ఈ సీజన్ కోసం తనని ఎవరూ సంప్రదించలేదని, ఒకవేళ అడిగిన తనకి వెళ్లే ఉద్దేశ్యం లేదని, నేను పబ్లిక్ పర్సనాలిటీని, అలాగని 24 గంటలు నా వ్యక్తిగత జీవితంపై కెమెరాలు ఉంచడం, నాకు ఇష్టం లేదు అంటూ తనపై వస్తున్న బిగ్ బాస్ న్యూస్ లని ఖండించింది భూమిక.