హీరోయిన్స్ అయినా, మరే ఆడపిల్ల అయినా నిజమైన అందం వాళ్ళ వయసుని బట్టే ఉంటుంది అంటుంది కోలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్. ఈమధ్యన రీ ఎంట్రీ తో లుక్స్ పై తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కుంటున్న శృతి హాసన్ అందం, అది ఏ వయసులో ఉంటుంది అనే దాని మీద పెద్ద లెక్చర్ ఇచ్చింది. అమ్మాయిల్లో నిజమైన అందం 15 నుండి 16 ఏళ్ళ వయసు లోనే ఉంటుంది అని, మళ్ళి అదే అందం వాళ్ళ 50 ఏళ్ళ వయసులో కనిపిస్తుంది అని అంటుంది. అమ్మాయిలు 30 ఏళ్ళ వయసులో అందంగా కనిపిస్తారనే దాని మీద నేను ఏకీభవించను.
నా ఆలోచనలో అమ్మాయిల్లో 15 నుండి 16 ఏళ్ళ అమ్మాయిల్లో అందం దాగుంటుంది. అలాగే మహిళల్లో 50 ఏళ్ళ వయసులో ఆ అందం కనిపిస్తుంది. నేను అదే నమ్ముతాను. 50 వయసులో వాళ్ళ అనుభవాలు నేర్పిన పాఠం వాళ్లలో ధైర్యం కలిగేలా చేస్తుంది. ఇక 15 ఏళ్ళ అమ్మాయిల్లో జీవితంపై ఎలాంటి అవగాహన ఉండదు. కాబట్టి ఫ్రెష్ గా ఉంటారు. 20 ఏళ్ళ వయసులోను లైఫ్ అంటే ఏమిటో తెలియదు. అప్పుడే వారు ఎలా ఉండాలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు. ఇక 30 ఏళ్ళు వచ్చాకే జీవితంపై అవగాహన వస్తుంది. నేను అయితే 30 లో వచ్చాకే నా లైఫ్, నా కెరీర్ గురించి ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా.. మనసుకు నచ్చినట్లుగా ఉంటున్నా అంటూ అందంపై ఫిలాసఫీ చెప్పుకొచ్చింది శృతి హాసన్.