ఎన్టీఆర్ ఇప్పుడు వరస పాన్ ఇండియా మూవీస్ తో ఎన్టీఆర్ ఫాన్స్ కి కిక్ ఇచ్చాడు. ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా మూవీ తర్వాత కొరటాలతోనూ, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా మూవీస్ ని ప్రకటించాడు. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ ఖుషి అవుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో కొమరం భీం గా ఇప్పటికే అదరగొడుతున్న ఎన్టీఆర్ త్వరలోనే బుల్లితెర మీదకి రాబోతున్నాడు. జెమినీ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరుడు షో కి హోస్ట్ గా ఎన్టీఆర్ బుల్లితెర ప్రేక్షకులని సర్ప్రైజ్ చెయ్యబోతున్నాడు. అయితే ఎప్పుడో మే నెలాఖరు నుండే అందుబాటులోకి రావాల్సిన ఎవరు మీలో కోటీశ్వరుడు షో.. కరోనా సెకండ్ వేవ్ వలన ఆగడం, ఆ షో త్వరలోనే అంటూ కన్ఫ్యూజ్ చేస్తుంది జెమిని టివి.
అయితే తాజాగా ఎవరు మీలో కోటీశ్వరుడు షో అతి త్వరలోనే మొదలు కాబోతున్నట్టుగా జెమిని ఛానల్ వారి ఎవరు మీలో కోటీశ్వరుడు కొత్త ప్రోమో చెబుతుంది. డేట్ ఇవ్వలేదు కానీ.. సెకండ్ ఓ కొలిక్కి రాగానే, లాక్ డౌన్ ఎత్తివేయగానే ఈ షో ఉంటుంది అని మాత్రం తెలుస్తుంది. జెమిని వారు ట్వీట్ చేస్తూ.. ఆట ఆడుతున్న వారి కలలను నెరవేరుస్తుంది. ఈ షో చూసే వారికి కూడా వంద శాతం వినోదాన్ని అందజేస్తుంది.. అంటూ షోపై అంచనాలు పెంచెయ్యడమే కాదు.. ఎన్టీఆర్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేసింది.