సీనియర్ హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్ళినా ఏమాత్రం తగ్గకుండా సినిమా అవకాశాలు ఒడిసి పట్టుకున్న కాజల్, తమన్నా, సమంతలు అటు ఇటుగా ఒకేసారి డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టారు. కాజల్, తమన్నాలు కన్నా ముందే సమంత పెళ్లి చేసుకుని వ్యక్తిగతంగా స్థిరపడినా.. కెరీర్ లో దూసుకుపోతుంది. మరోపక్క కాజల్ గత ఏడాది పెళ్లి చేసుకుని సినిమా అవకాశాలతో అదరగొట్టేస్తుంది. ఇక తమన్నా ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజినే. అయితే ఈ ముగ్గురు హీరోయిన్స్ ఒకేసారి అంటే అటు ఇటుగా ఒకే ఏడాదిలో డిజిటల్ మీడియాకి ఎంట్రీ ఇచ్చారు. అందులో తమన్నా 11th అవర్, కాజల్ లైవ్ టెలికాస్ట్, సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 తో డిజిటల్ మీడియాకి ఎంట్రీ ఇచ్చారు.
తమన్నా ఈ మధ్యలో నవంబర్ స్టోరీస్ కూడా చేసింది. అయితే అటు తమన్నా, ఇటు కాజల్ డిజిటల్ మీడియాలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. 11th అవర్ లో తమన్నా క్లాస్ గా పెరఫార్మెన్స్ పరంగా పర్లేదనిపించుకుంది. ఇక కాజల్ లైవ్ టెలికాస్ట్ వెబ్ సీరీస్ లో అంతగా మెప్పించలేదు. కానీ సమంత ఫ్యామిలీ మ్యాన్ లో రాజి పాత్రలో నెగెటివ్ గా అదరగొట్టేసింది. డీ గ్లామర్ గా సమంత రాజి రోల్ లో పెరఫార్మెన్స్ పరంగా పీక్స్ లో చేసింది. అసలు రాజి పాత్రలో మరొకరిని ఊహించలేం. అంతలాంటి పెరఫార్మెన్స్ తో సమంత ఫ్యామిలీ మ్యాన్ కి బ్యాక్ బోన్ లా నిలిచింది. మనోజ్ బజ్ పేయి తో సమానంగా నటించి అదరగొట్టేసింది.
మరి డిజిటల్ మీడియాలో కాజల్, తమన్నాలు గ్లామర్ పరంగా తెలిపితే సమంత మాత్రం డీ గ్లామర్ గా ఇరగదీసేసింది అనే చెప్పాలి.