Advertisementt

ఇంత బోల్డ్ గానా?

Sat 05th Jun 2021 08:23 PM
samantha akkineni,bold role,family man 2,samantha  ఇంత బోల్డ్ గానా?
Samantha Has A Bold Role In The Family Man 2 ఇంత బోల్డ్ గానా?
Advertisement
Ads by CJ

సమంత టాలీవుడ్ లో కమర్షియల్ మూవీస్ లో చాలా గ్లామర్ గా కనిపించింది. గ్లామర్ గా నటించడానికి, అందాలు ఆరబొయ్యడానికి ఎక్కడ మొహమాటపడలేదు. అంతెందుకు పెళ్ళయాక కూడా భర్తతో కలిసి సమంత చేసిన రచ్చ, బికినీ లతో దిగిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి అక్కినేని అభిమానుల చేతిలో తిట్లు కూడా తింది. అయితే పెళ్లి తర్వాత సమంత చేసిన కేరెక్టర్స్ లో గ్లామర్ కి గ్లామర్, పెరఫార్మెన్స్ కి పెరఫార్మెన్స్ అన్నీ సమపాళ్లలో మిక్స్ చేసే పాత్రలని సమంత ఎంచుకుంటుంది. రంగస్థలం, యు టర్న్, ఓ బేబీ, రీసెంట్ గా శాకుంతలం, అలాగే డిజిటల్ మీడియాలో ఆమె చేసిన వెబ్ సీరీస్ ఇలా ప్రతిదానిలో సమంత తన ప్రత్యేకతని చాటుతుంది.

అయితే ఎప్పుడూ లిమిట్స్ క్రాస్ చెయ్యని సమంత ఇప్పుడు బాలీవుడ్ భామలను మించి హిందీ లో చేసిన వెబ్ సీరీస్ లో బోల్డ్ గా నటించి అమ్మో సమంతలో ఈ యాంగిల్ కూడా ఉందా అనేలా అరిపించేసింది. డీ గ్లామర్ అంటే అలంటి ఇలాంటి డీ గ్లామర్ కాదు.. మరీ మసిబొగ్గు మొహంతో, జిడ్డు కారే ఫేస్ లో సమంత బెడ్ రూమ్ సీన్స్ లో బాగా అదరగొట్టేసింది. తాను పనిచేసే మిల్లు ఓనర్ తోనూ, అలాగే తన వ్యాన్ ని చెక్ పోస్ట్ నుండి వదిలే సందర్భంలో ఆ ఆఫీసర్ కోరిక తీర్చే క్రమంలో సమంత నటన కేక పెట్టాల్సిందే. రాజి పాత్రలో సమంత బోల్డ్ గా రెచ్చిపోయి వావ్ అనిపించుకుంది. అసలు అలంటి కేరెక్టర్ లో ఏ సౌత్ హీరోయిన్ చెయ్యని సాహసం చేసింది అనే చెప్పాలి.

Samantha Has A Bold Role In The Family Man 2:

Samantha Akkineni to a play bold role in The Family Man 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ