అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ పుష్ప షూటింగ్ సెకండ్ వేవ్ మొదలు కావడంతో ఆగలేదు. అల్లు అర్జున్ కోవిడ్ బారిన పడడం, విలన్ గా చేస్తున్న ఫహద్ ఫాజిల్ అందుబాటులో లేని కారణంగా పుష్ప షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత తెలంగాణాలో లాక్ డౌన్ పెట్టడంతో పుష్ప టీం సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణాలో లాక్ డౌన్ అమలవుతున్నా మధ్యాన్నం వరకు సడలింపులు ఉండడంతో ఒక్కొక్కరిగా షూటింగ్స్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. జూన్ 9 తర్వాత తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేస్తుంది అన్న ప్రచారంతో ఇప్పుడు సుకుమార్ అండ్ పుష్ప టీం లు షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారట.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇళ్ళకి వెళ్లిపోయిన నటులని ఒక్కోక్కరిగా సుకుమార్ ఫోన్స్ చేసి పిలవడానికి రెడీ అవుతున్నాడట. పుష్ప కొత్త షెడ్యూల్ మొదలు పెట్టేటప్పటికీ.. అందరూ అందుబాటులో ఉండాలని.. పార్ట్ వన్ అన్ని అనుకూలంగా ఉంటే ఆగస్టు లోనే రిలీజ్ చేసెయ్యాలనే కసితో టీం ఉందట. అందుకే అల్లు అర్జున్ కూడా సుక్కు ఎపుడు పిలిస్తే అప్పుడు వచ్చేయడానికి రెడీగా ఉన్నాడట. అల్లు అర్జున్ తాజాగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా తన ఇంటి కాంపౌండ్ లో మొక్కలు నాటి.. ఆ ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. పుష్ప షూటింగ్ ఇంకా మిగిలే ఉండడంతో అల్లు అర్జున్ ఇంకా పుష్ప లుక్ లోనే కంటిన్యూ అవుతున్నాడు. ఇక పుష్ప విలన్ ఫాహద్ గనక సెట్స్ మీదకొచ్చేస్తే అల్లు అర్జున్ కూడా జాయిన్ అవుతాడట. ప్రస్తుతం అల్లు అర్జున్ - ఫహద్ ఫాజిల్ పై యాక్షన్ సన్నివేశలను సుకుమార్ తెరకెక్కించడానికి సిద్దమవుతున్నాడట.