బాలీవుడ్ సీరియల్ నటుడు అత్యాచారం కేసులో అరెస్ట్ కావడం కలకలం రేపింది. ముంబై లో హిందీ టీవీ సీరియల్స్ లో నటించే బుల్లితెర నటుడు పర్ల్ వీ పూరి.. ఓ రేప్ కేసులో అరెస్ట్ అవడం, అతనితో పాటు మరో ఐదుగురిని కూడా పోలీస్ లు అరెస్ట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనలో పరమ్ ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ముంబైలోని తనపై కారులో అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీస్ లకి ఫిర్యాదు చెయ్యడంతో అతన్ని అరెస్ట్ చేసారు పోలీస్ లు.
నాగిన్ సీరియల్ తో బాగా ఫెమస్ అయిన పర్ల్ వీ పూరి సూరత్ అనే సీరియల్ తో బుల్లితెరపై పరిచయం అయ్యాడు. ప్రస్తుతం బ్రహ్మరాక్షసుడు 2 లో నటిస్తున్నాడు. పర్ల్ వీ పూరిపై రేప్ కేసు నమోదు కావడంతో శుక్రవారం రాత్రి పర్ల్ వీ పూరి ని పోలీస్ లు అరెస్ట్ చేసారు. అలాగే ఈ కేసులో మరో ఐదుగురిని కూడా పోలీస్ లు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. సెలబ్రిటీ హోదా లో ఉన్న ఇతడు ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడడం మాత్రం అందరిని షాక్ కి గురి చేసింది.