మహారాష్ట్రలో మహా జనతా కర్ఫ్యూతో హోటల్స్, మాల్స్, థియేటర్స్, సినిమా షూటింగ్స్ అన్ని నెల పదిహేను రోజులుగా బంద్ అయ్యాయి. కరోనా కేసులు అత్యధికంగా నమోదు కావడంతో మహారాష్ట్ర సర్కార్ అందరికన్నా ముందే మహా జనతా కర్ఫ్యూ అంటూ లాక్ డౌన్ ఆంక్షలను అమలు చేసింది. దానితో సినిమా షూటింగ్స్, సినిమా రిలీజ్ లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గఫై సాధారణపరిస్థితులు నెలకొన్న కారణముగా అక్కడ ప్రభుత్వం, అన్ లాక్ ప్రక్రియ మొదలు పెట్టబోతోంది. సోమవారం నుంచి అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించబోతున్నామని.. అది కడుఆ ఐదు విడతల్లో ఈ ప్రక్రియను అమలు చేస్తామని చెప్పింది.
ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ, కరోనా పాజిటివిటీ రేటు ఆధారంగా చేసుకుని జిల్లాల వారీగా అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 18 జిల్లాలులో ఐదు శాతం కంటే తక్కువ, 25 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ ఉంది అని.. దీనిలో భాగంగా ఈ జిల్లాలో అన్ లాక్ ప్రక్రియ కింద కింద రెస్టారెంట్లు, సెలూన్లు, థియేటర్లు, షాపులు అన్నీ ఓపెన్ అవుతాయని చెప్పింది. అంతేకాకుండా సినిమా షూటింగ్స్ కి అనుమతులు ఇవ్వబోతున్నట్టుగా తెలిపింది. ఇక లెవెల్ 2 అంటే 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ 25 నుంచి 40 వరకు ఉన్నవన్నీ సెకండ్ లెవెల్ కిందకి వస్తాయని, ముంబై కూడా సెకండ్ లెవల్ కిందికి వస్తుంది కాబట్టి సినిమా షూటింగులకు అనుమతిస్తామని తెలిపింది. దానిలో భాగంగా షాపులు తెరవచ్చని.. అయితే రెస్టారెంట్లు, మాల్స్, జిమ్ లు, సెలూన్లకు మాత్రం పాక్షిక సడలింపు మాత్రమే ఉంటుందని చెప్పింది.