ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ సీజన్ 2 జూన్ 3 రాత్రి 9 గంటల నుండి అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చింది. అయితే ఫ్యామిలి మ్యాన్ సీజన్ వన్ కన్నా సీజన్ 2 పై భారీ క్రేజ్ ఉంది. కారణం ఒక్కటే టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ నెగెటివ్ రోల్ లో నటించడం, సీజన్ వన్ బ్లాక్ బస్టర్ కావడం. అయితే అందరి అంచనాలను ఫ్యామిలీ మ్యాన్ 2 రీచ్ అయ్యిందో లేదో కానీ.. అందులో నెగెటివ్ రోల్ అంటే శ్రీలంక LTT టెర్రరిస్ట్ గా రాజి పాత్ర చేసిన సమంత కి బాగా పేరొచ్చింది. హీరో కేరెక్టర్ చేసిన మనోజ్ బజ్ పేయీతో సమానంగా కనిపించి థ్రిల్ చేసింది.
అయితే ఈ సీజన్ ప్రైమ్ లోకి రాకముందే కాంట్రవర్సీలో చిక్కుకుంది. సమంత చేసిన రాజి కేరెక్టర్ పై తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ హీరోయిన్ అయ్యుండి తమిళకు శత్రువులైన LTT అమ్మాయిల ఎలా నటిస్తుంది అంటూ సమంతని హేట్ చెయ్యగా.. ఆ విషయంపై సమంత ఎక్కడా స్పందించలేదు. ఫ్యామిలీ మ్యాన్ రిలీజ్ అయ్యేవరకు సైలెంట్ గా ఉంది. అయితే ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ రిలీజ్ అయ్యాక సమంత కేరెక్టర్ కి వస్తున్న స్పందన చూసి బాగా ఎమోషనల్ అవుతుంది. ఫ్యామిలీ మ్యాన్ లో నా పాత్రకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్, రివ్యూస్, కామెంట్స్ అన్ని సంతోషాన్నిస్తున్నాయి.
ఈ సీరీస్ లో నేను పోషించిన రాజి పాత్ర నాకెప్పటికీ స్పెషల్. ఈ పాత్ర కోసం రాజ్ అండ్ డీకే వాళ్ళు నన్ను అడిగినప్పుడు రాజీ పాత్ర చెయ్యడానికి సెన్సిటివిటీ, బ్యాలెన్స్ ఎంతో అవసరమనుకున్నాను. ఇక నేను న పాత్ర ని చేసేముందు ఈలం యుద్ధంలో తమిళుల పోరాటాలు.. ముఖ్యంగా మహిళల ఎదుర్కొన్న ఇబ్బందుల గురించిన డాక్యుమెంటరీస్ చూసినప్పుడు ఈ పాత్ర చెయ్యడానికి భయం వేసింది. అయితే అందులో రాజి కథ కల్పితమే అయినా.. వాళ్ళ పోరాటాలు నన్ను కదిలించివేశాయి. రాజి కథ మనకు అవసరం, అమ్మాయిల్లో తెగువ అవసరం అంటూ సమంత ఎమోషనల్ అవుతుంది.