Advertisementt

అల్లు శిరీష్ హీరోయిన్ పెళ్లి షాక్

Sat 05th Jun 2021 10:43 AM
yami gautam,married,director aditya dhar,uri fame,yami gautam wedding,yami gautam marriage  అల్లు శిరీష్ హీరోయిన్ పెళ్లి షాక్
Actress Yami Gautam married అల్లు శిరీష్ హీరోయిన్ పెళ్లి షాక్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ తో గౌరవం సినిమా అలాగే కొరియర్ బాయ్ కళ్యాణ్, నువ్విలా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యామి గౌతమ్ ప్రస్తుతం బాలీవుడ్ లోనే స్థిరపడింది. అక్కడ సినిమాలు, కమర్షియల్ యాడ్స్ లో నటించే యామి గౌతమ్ పెళ్లి చేసుకుని షాకిచ్చింది. లాక్ డౌన్ లో చాలామంది హీరో, హీరోయిన్స్ ఇలానే గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళి చేసుకుని షాకిస్తున్నట్టుగా యామి గౌతమ్ కూడా పెళ్ళి చేసేసుకుని ఆ ఫొటోస్ లని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యామి బాలీవుడ్ లో నటించిన ఉరి సినిమా దర్శకుడు ఆదిత్య ధార్ ని గుట్టుచప్పుడు కాకుండా పెళ్ళి చేసుకుంది.

నిన్నగాక మొన్న టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ పెళ్లి చేసుకుని ఫొటోస్ పోస్ట్ చేసిన షాక్ నుండి ఇంకా తేరుకోకముందే యామి గౌతమ్ పెళ్లి అందరిని షాకిచ్చింది. లాక్ డౌన్ లో పెళ్లి చేసుకుంటున్నా కనీసం చిన్న చప్పుడు కూడా బయటికి రాకుండా పెళ్లిళ్లు చేసుకోవడమే అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. సెలబ్రిటీస్ పెళ్లిళ్లు అంటే హడావిడి, ఆర్భాటం, సందడి ఉంటుంది. కానీ లాక్ డౌన్ పెళ్లిళ్లలో హంగు ఆర్భాటం ఉన్నా సందడి మాత్రం మిస్ అవుతుంది. అయినా చాలామంది హీరోయిన్స్, హీరోలు ఇలా లాక్ డౌన్ లో ఓ ఇంటి వారవుతున్నారు.

Actress Yami Gautam married :

Yami Gautam married director Aditya Dhar of Uri fame