Advertisementt

చెల్లిగా విద్య బాలన్.. బాడీ గార్డ్ గా మెగా హీరో

Tue 08th Jun 2021 12:22 PM
vidya balan,varun tej,chiranjeevi,sister,lucifer remake  చెల్లిగా విద్య బాలన్.. బాడీ గార్డ్ గా మెగా హీరో
Mega hero in Lucifer remake చెల్లిగా విద్య బాలన్.. బాడీ గార్డ్ గా మెగా హీరో
Advertisement
Ads by CJ

మలయాళం లో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ లూసిఫర్ మూవీని తెలుగులో చిరు మోహన్ రాజా దర్శకత్వంలో రీమేక్ చెయ్యబోతున్న విషయం తెలిసిందనే. ఈ మధ్యనే లూసిఫెర్ రీమేక్ ని చిరు ఆపేశారని టాక్ నడిచినా.. లాక్ డౌన్ అయ్యాక లూసిఫర్ రీమేక్ కొత్త షెడ్యూల్ ప్లాన్ లో మోహన్ రాజా ఉన్నారట. అయితే ఈ సినిమాలో చిరు చెల్లి పాత్రలో నయనతార నటిస్తుంది అనే టాక్ నడిచినా తాజాగా చిరు చెల్లెలి పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ పోషించబోతుందట. సహజ సిద్ధంగా ఉన్న ఎలాంటి కథనైనా చేయడానికి నేను సిద్ధం అని విద్య బాలన్ చెప్పడంతో ఆమెని చిరు సిస్టర్ కేరెక్టర్ కోసం సంప్రదించారట.

ఇక మలయాళంలో లూసిఫర్ లో మోహన్ లాల్ కి బాడీ గార్డ్ గా హీరో పృద్వి రాజ్ నటించారు. ఇప్పడు ఆ పాత్రని మెగా హీరో వరుణ్ తేజ్ చేయబోతున్నాడనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వరుణ్ తేజ్ చిరు కి బాడీ గార్డ్ కేరెక్టర్ లో లూసిఫర్ రీమేక్ లో కనిపిస్తాడని అంటున్నారు. మరి విద్యాబాలన్ సిస్టర్ గాను, వరుణ్ తేజ్ బాడీ గార్డ్ గా నటించడం నిజామా.. కదా అనేది దర్శకుడు కానీ, మెగా కాంపౌండ్ కానీ క్లారిటీ ఇచ్చేస్తే తెలిసిపోతుంది. లేదంటే ఇలాంటి వార్తలు మరెన్ని వినాల్సి వస్తుందో.

Mega hero in Lucifer remake:

Vidya Balan Chiranjeevi sister in Lucifer Remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ