Advertisementt

షాకిచ్చిన అడవి శేష్

Fri 04th Jun 2021 06:37 PM
adivi sesh,love life,hyderabadi woman,adivi sesh love  షాకిచ్చిన అడవి శేష్
Adivi Sesh is in love! షాకిచ్చిన అడవి శేష్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకుల లిస్ట్ లో అడవి శేష్ కూడా ఉంటాడు. సినిమాల్లో హీరోగా, రైటర్ గా పని చేసిన అడివి శేష్ గూఢచారి, క్షణం, ఎవరు లాంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు బ్యానర్ లో మేజర్ పాన్ ఇండియా ఫిలిం, నాని బ్యానర్ లో హిట్ 2  లో నటిస్తున్న అడివి శేష్.. ప్రేమలో ఉన్న విషయం చెప్పి షాకిచ్చాడు. గూఢచారి సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియని అడవి శేష్ వివాహం చేసుకోబోతున్నాడనే ప్రచారం జరిగినా అది ఒట్టి ట్రాష్ అని కొట్టిపారేసిన అడివి శేష్ ఇప్పుడు నేను సింగిల్ కాదంటున్నారు.

హైదరాబాద్ అమ్మాయితో ప్రేమలో ఉన్నాను. ఇప్పుడే నా రిలేషన్ షిప్ స్టేటస్ గురించి చెప్పాలనుకోవడం లేదు. ప్రస్తుతం ప్రేమలో ఉన్న నేను.. పెళ్లికి చేసుకునేందుకు మాత్రం చాలా టైం పట్టేసేలా ఉంది అంటున్నాడు. ఇంతకంటే ఎక్కువ ఏమి చెప్పలేను అని, ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితానికి తాను గౌరవం ఇవ్వాలనుకుంటున్నట్లుగా అడవి శేష్ చెప్పడం విశేషం. ఒకవేళ నేను లవ్ చేసిన అమ్మాయి గనక పర్మిషన్ ఇస్తే మిగతా విషయాలను మీతో పంచుకుంటాను అని అంటున్నాడు. మేజర్ తర్వాత హిట్ 2  షూటింగ్ పూర్తవ్వాలి.. పెళ్లి గురించిన ఆలోచన మాత్రం అప్పుడే లేదు అంటూ ఇంకా పెద్ద షాకిచ్చాడు ఈ హ్యాండ్ సం కుర్రాడు.

Adivi Sesh is in love!:

  Finally Sesh has opened up about his love life and confessed that he is in love with a Hyderabadi woman. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ