తెలంగాణాలో మే10 నుండి లాక్ డౌన్ మొదలయ్యింది. కరోనా కేసులు పెరిగిపోవడంతో హై కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించగా సీఎం కేసీఆర్ అప్పటికప్పుడు తెలంగాణాలో లాక్ డౌన్ పెడుతున్నట్లుగా ప్రకటించారు. అప్పటినుండి తెలంగాణాలో కేవలం నాలుగు గంటల ఆంక్షల సడలింపు ఉండగా 20 గంటల కర్ఫ్యూ నడుస్తుంది. సెకండ్ వేవ్ తో సినిమా షూటింగ్స్ అన్ని ఎక్కడిక్కడే ఆగిపోయాయి. లాక్ డౌన్ పెట్టేముందు వరకు అఖండ, శ్యామ్ సింగ రాయ్, శాకుంతలం లాంటి మూవీ షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ మరీ నాలుగు గంటల సడలింపులో షూటింగ్స్ చెయ్యలేక చాలామంది దర్శకనిర్మాతలు సినిమా షూటింగ్స్ ఆపేసారు.
అయితే ప్రస్తుతం తెలంగాణాలో లాక్ డౌన్ నడుస్తున్నా మధ్యాన్నం 1 నుండి 2 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉండడంతో అటు సీరియల్ షూటింగ్స్ ఇటు సినిమా షూటింగ్స్ ఒక్కొక్కటిగా మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే నాగార్జున - ప్రవీణ్ సత్తారు మూవీ షూటింగ్ జూన్ సెకండ్ వీక్ నుండి మొదలు కాబోతుంది. అలాగే గుణశేఖర్ కూడా శాకుంతలం షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టుగా చెబుతున్నారు. ఇక అఖండ మేజర్ పార్ట్ బ్యాలెన్స్ ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఫినిష్ చేసే ఆలోచనలో ఉంది టీం. ఇలా ప్రతి ఒక్కరూ మళ్ళీ తమ షూటింగ్స్ మొదలు పెట్టుకోవడానికి నెమ్మదిగా సిద్దమవుతున్నారు. మళ్ళీ లాక్ డౌన్ ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొంటే మరోసారి రిలీజ్ డేట్స్ జాతర మొదలవుతుంది.