Advertisementt

వావ్ చైతూ వాట్ ఏ మేకోవర్

Fri 04th Jun 2021 10:40 AM
naga chaitanya,naga chaitanya new look,thank you movie,love story movie,chaitu new look  వావ్ చైతూ వాట్ ఏ మేకోవర్
Wow Chaitu What a Makeover వావ్ చైతూ వాట్ ఏ మేకోవర్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి మాస్ గానో, లేదంటే క్లాస్ హీరోగా నో ప్రోజెక్ట్ అవుతూ వస్తున్నాడు తప్పితే.. పెద్దగా కొత్త లుక్ ట్రై చేసింది లేదనే చెప్పాలి. మనం, ఏమాయ చేసావే లాంటి చిత్రాల్లో క్లాస్ గా, ఆటో నగర్ సూర్య లాంటి సినిమాలో మాస్ గా, మజిలీ లాంటి సినిమాలో మిడిల్ క్లాస్ కుర్రాడిగా నాగ చైతన్య కనిపించిన లుక్ లో పెద్దగా అక్కినేని హీరో వేరియేషన్స్ చూపెట్టలేదనే చెప్పాలి. తాజాగా థాంక్యూ సినిమాలోనూ నాగ చైతన్య పెద్ద గా డిఫ్రెంట్ గా కనిపించలేదు. ఇక లవ్ స్టోరీలో మిడిల్ క్లాస్ కుర్రాడి లుక్ లోనే కనిపించిన నాగ చైతన్యని తాజాగా చూస్తే వావ్ అనేస్తారు.

అంత చక్కటి మేకోవర్ లో చైతూ ని చూస్తే నిజంగా వావ్ ఏమున్నాడురా అనాల్సిందే. అయితే నాగ చైతన్య ఈ కొత్త మేకోవర్ మాత్రం టాలీవుడ్ మూవీస్ కోసమైతే కాదనిపిస్తుంది. ఎందుకంటే నాగ చైతన్య బాలీవుడ్ లో అమీర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చద్దా లో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. మొన్న మధ్యన ముంబై వెళ్లి లుక్ టెస్ట్ చేయించుకున్న నాగ చైతన్య ప్రస్తుతం ఆ మూవీ కోసమే ఇలా కొత్తగా మేకోవర్ అయినట్లుగా తెలుస్తుంది. ఆర్మీ జవాన్ గా లాల్ సింగ్ చడ్డా లో చైతూ క్లెయిమ్స్ సన్నివేశాల్లో స్పెషల్ గా కనిపించబోతున్నాడని.. ఆ రోల్ కోసమే కాస్త వెయిట్ పెరిగి.. చిన్న గడ్డంతో ఇలా కొత్తగా స్టయిల్ మర్చాడని అంటున్నారు. అయితే దేని కోసమైతే మాకేంటి చైతూ ని చూస్తుంటే కొత్తగా సూపర్ గా ఉన్నాడు అంటున్నారు అక్కినేని అభిమానులు.

Wow Chaitu What a Makeover:

Naga Chaitanya New Look Goes Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ